నరేంద్ర మోడీ హవా: ఎన్డీయేకు 233, యూపిఏకు 119

ఎబిపి న్యూస్ కోసం ఎసి నీల్సన్ నిర్వహించిన తాజా సర్వేలో బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డీయేకు 233 లోక్ సభ స్థానాలు వస్తాయని తేలింది. యూపిఏ 119 స్థానాలతో సరిపెట్టుకుంటుంది. బిజెపి సొంతంగా 209 స్థానాలు దక్కించుకుంటుందని, కాంగ్రెస్ 91 స్థానాలకు పరిమితమవుతుందని తెలిపింది.
ఇతర పార్టీల విషయానికొస్తే అత్యధికంగా తృణమూల్ కాంగ్రెస్ 28, వామపక్షాలు 23, ఏఐడిఎంకె 21, బిఎస్పీ 18, బిజెడి 17 గెలుచుకోనుందట. తూర్పున, ఉత్తరాదిన ఎన్డీయో 116 స్థానాల్లో 86, 151 స్థానాల్లో 87 వరుసగా గెలుచుకుంటుందట. దక్షిణాదిన మాత్రం ఎన్డీయే కంటే యూపిఏ మెరుగ్గా ఉంది.
దక్షిణాదిన కాంగ్రెసు 35, బిజెపి 21 సీట్లు గెలిచే అవకాశముందట. అయితే, పొత్తులు, ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉండనుంది. ప్రధానమంత్రి పదవి విషయానికి వస్తే.... మోడీకి 54 శాతం మంది, రాహుల్ గాంధీకి 18 శాతం మంది, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌లకు ఐదు శాతం మంది ఓటేశారు.












Click it and Unblock the Notifications