మహారాష్ట్ర నూతన డీజీపీగా 26/11 హీరో..
మహారాష్ట్ర నూతన డీజీపీగా సదానంద్ దతే నియమితులయ్యారు. 26/11 ముంబై దాడుల్లో ఉగ్రవాదులపై సదానంద్ దతే వీరోచితంగా పోరాడారు. ప్రస్తుతం ముంబై డీజీపీగా ఉన్న రష్మీ శుక్లా జనవరి 3 న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో 1990 బ్యాచ్ కు చెందిన 59 ఏళ్ల దతే నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన రెండేళ్ల పాటు డీజీపీగా సేవలందించనున్నారు.

మహారాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ పోలీస్ అధికారి సదానంద్ దతే నియమితులయ్యారు. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ఉగ్రవాదులపై సదానంద్ దతే వీరోచితంగా పోరాడారు. ప్రస్తుతం ముంబై డీజీపీగా ఉన్న రష్మీ శుక్లా స్థానంలో 1990 బ్యాచ్ కు చెందిన 59 ఏళ్ల దతే నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన రెండేళ్ల పాటు డీజీపీగా కొనసాగనున్నారు.
26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడిన పోలీస్ అధికారి సదానంద్ వాసంత్ దతే మహారాష్ట్ర నూతన డీజీపీగా నియమితులయ్యారు. 1990 బ్యాచ్‌కు చెందిన 59 ఏళ్ల దాతే, జనవరి 3న పదవీ విమరణ చేయనున్న రష్మీ శుక్లా స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన రెండేళ్ల పాటు డీజీపీగా సేవలందించనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం డిప్యూటేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. దతేను అత్యున్నత పదవి వరించింది. అంతకుముందు ఆయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చీఫ్ గానూ సేవలందించారు.
ఇక 2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో సదానంద్ దతే అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కామా ఆస్పత్రి వద్ద దతే.. ఉగ్రవాదులైన కసబ్, అబూ ఇస్మాయిల్ లను వీరోచితంగా ఎదుర్కొన్నారు. ఈ దాడిలో అతనికి గ్రెనేడ్ ముక్కలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. అయినా ధైర్యం చెక్కు చెదరకుండా ఉగ్రమూకలపై పోరాటం చేశారు. ఆయన వీరోచిత పోరాటానికి గుర్తుగా ఆయనకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.












Click it and Unblock the Notifications