వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జీ కేసు: రిస్క్ చేసిన రాజా, కోర్టులో వాదనలతో బయటకు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

2G Spectrum Case : 2జీ స్పెక్ట్రమ్‌ కేసు : ఒకపక్క హర్షం, మరో పక్క విమర్శలు !

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ టెలికం శాఖ మంత్రి ఎ. రాజా, ఆయన మాజీ ప్రైవేట్ కార్యదర్శి ఆర్ కె చందోలియాలు చేసిన సాహసం వారిని కేసు నుండి బయటపడేసింది. ఈ కేసులో వీరిద్దరూ కూడ తమ వాదనను కోర్టులో సమర్ధించుకొన్నారు. వీరిద్దరూ సమర్థవంతంగా తమ వాదనలు విన్పించడంతో ఈ కేసు నుండి బయటకు వచ్చారని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2జీ కుంభకోణం కేసులో నిందితులను నిర్ధోషులుగా పాటియాల కోర్టు గురువారం నాడు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో కాంగ్రెస్, డిఎంకె వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఈ కేసు విషయమై మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్‌రాయ్‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. వినోద్‌రాయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.

 రిస్క్ చేసిన రాజా, చందోలియాలు

రిస్క్ చేసిన రాజా, చందోలియాలు

2జీ కేసులో మాజీ కేంద్ర టెలికం శాఖ మంత్రి ఎ. రాజా. ఆయన మాజీ ప్రైవేట్ కార్యదర్శి ఆర్ కె చందోలియాలు చాలా రిస్క్ చేశారని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కును మాజీ మంత్రి రాజా, ఆయన ప్రైవేట్ సెక్రటరీ చందోలియాలు చక్కగా ఉపయోగించుకొన్నారని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ హక్కును ఉపయోగించి సమర్ధవంతంగా తమ వాదనను విన్పించారని న్యాయనిపుణులు చెబుతున్నారు.

2జీ నుండి కామన్వెల్త్ వరకు: ఎవరీ వినోద్‌రాయ్? 2జీ నుండి కామన్వెల్త్ వరకు: ఎవరీ వినోద్‌రాయ్?

రాజ్యాంగం ఏం చెబుతోంది

రాజ్యాంగం ఏం చెబుతోంది

రాజ్యాంగం కల్పించిన హక్కును మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజా, ఆయన వద్ద ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేసిన ఆర్ కె చందోలియాలు చక్కగా ఉపయోగించుకొన్నారు.తమ వాదనకు తామే సాక్షులుగా కోర్టు ముందుకు వచ్చి తమ వాదనను సమర్ధవంతంగా విన్పించారని ఓ న్యాయవాది విజయ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.అయితే ఇది చాలా రిస్క్‌తో కూడుకొన్న వ్యవహరమని ఆయన అభిప్రాయపడ్డారు.రాజ్యాంగం ఈ హక్కును కల్పించిన విషయాన్ని న్యాయ నిపుణులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

2జీ కేసు: నాడు జయలలితకు ఎలా కలిసి వచ్చిందంటే?2జీ కేసు: నాడు జయలలితకు ఎలా కలిసి వచ్చిందంటే?

అరుదుగా ఈ తరహ ఘటనలు

అరుదుగా ఈ తరహ ఘటనలు

మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజా కోర్టులో తమ వాదనను సమర్థించుకొనే హక్కు అరుదుగా జరుగుతోందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో రాజా, చందోలియాలు తమ వాదనను అత్యంత సమర్ధవంతంగా విన్పించారని, అందుకే ఈ కేసు నుండి వారు బయటకు వచ్చారని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఐపీసీలోని సెక్షన్ 315 ప్రకారం ఒక నిందితుడు సాక్షిగా ముందుకొచ్చే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

పొరపాటుపడితే ఇబ్బందులు

పొరపాటుపడితే ఇబ్బందులు

ఈ కేసులో నోరు తెరవకుండా ఉండే అవకాశం కూడ రాజ్యాంగం వారికి కల్పించింది. అయితే రాజ్యాంగం కల్పించిన హక్కును తీసుకొన్న రాజా తమ వాదనను సమర్ధించుకొన్నారు. అయితే నోరు జారితే మాత్రం తీవ్రంగా ఇబ్బందులపాలయ్యేవారని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు..

English summary
A calculated risk taken by of two of the 2G scam accused — former telecom minister A Raja and his then private secretary RK Chandolia — appears to have paid off with their acquittal by a special court, .Both of them decided to present themselves as witnesses in their defence, forgoing their constitutional right to remain silent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X