Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం: కారుపై బుల్లెట్ల వర్షం: టోల్‌ప్లాజా వద్ద నాలుగు రౌండ్లు కాల్పులు

న్యూఢిల్లీ: దేశంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 10వ తేదీన తొలి విడత పోలింగ్ ఆరంభమౌతుంది. ఫిబ్రవరి 10,14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది. అదే నెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

 వాడివేడిగా..

వాడివేడిగా..

అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న అయిదింట్లో.. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం.. ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లల్లో ప్రస్తుతం కాషాయ జెండా ఎగురుతోంది. పంజాబ్‌ను కాంగ్రెస్ పరిపాలిస్తోంది. పంజాబ్‌‌ను హస్తగతం చేసుకోవడంతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ సర్వశక్తులను ఒడ్డుతోంది. విస్తృతంగా ప్రచార కార్యక్ర

బీజేపీ టార్గెట్..

బీజేపీ టార్గెట్..

బీజేపీ దూకుడును నిలువరించడానికి అన్ని ప్రధాన ప్రతిపక్షాలు ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. తన అధికార పరిధిని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరింపజేసుకోవడానికి ఆమ్ఆద్మీ పార్టీ కసరత్తు చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే- ఢిల్లీని రోల్ మోడల్‌గా తీసుకుని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తామంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు. పంజాబ్, గోవాలపై ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి పెట్టింది.

అసదుద్దీన్ కారుపై కాల్పులు..

అసదుద్దీన్ కారుపై కాల్పులు..

ఈ పరిణామాల మధ్య ఉత్తర ప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం జరిగింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఆ సమయంలో ఆయన కారులోనే ఉన్నారు. మూడు-నాలుగు రౌండ్ల పాటు ఆయన కారుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కారు టైర్లు పేలిపోయాయి. అక్కడే ఉన్న స్థానికులు అప్రమత్తం కావడంతో దుండగులు పారిపోయారు.

 మీరట్ సమీపంలో

మీరట్ సమీపంలో

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అసదుద్దీన్ ఒవైసీ.. ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి వివరించారు. అసదుద్దీన్ ఒవైసీ విస్తృతంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్నారు. ఇవ్వాళ ఆయన మీరట్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కితౌర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని కారులో ఢిల్లీలో బయలుదేరిన సందర్భంగా ఆయనపై కాల్పులు చోటు చేసుకున్నాయి. మీరట్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తోన్న సమయంలో మార్గమధ్యలోని ఛజార్సీ టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన సంభవించింది.

కారుపై బుల్లెట్ తగిలిన గుర్తులు..

కారుపై బుల్లెట్ తగిలిన గుర్తులు..

టోల్ ప్లాజా వద్ద కారు స్లో అయిన సమయంలో ముగ్గురు నుంచి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. కారు ఎడమ వైపు ఫ్రంట్ డోర్, బ్యాక్ డోర్‌కు బుల్లెట్లు తాకాయి. ఆ గుర్తులను కూడా అసదుద్దీన్ ఒవైసీ మీడియా ప్రతినిధులకు చూపించారు. బుల్లెట్లు తగిలి కారు టైర్లు పేలిపోయాయని చెప్పారు. తాను మరో కారులో ఢిల్లీకి బయలుదేరానని ఆయన వివరించారు.

తీవ్ర ఉద్రిక్తత..

తీవ్ర ఉద్రిక్తత..

సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అప్రమత్తం అయ్యారు. గట్టిగా కేకలు వేయడంతో వారు పారిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేడెక్కించినట్టయింది. తనపై కాల్పులు జరిపిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.

Recommended Video

    టీటీవీ దినకరన్ పార్టీతో కలిసి అసదుద్దీన్ AIMIM పొత్తు || Oneindia Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+