జపాన్ యువతిపై గ్యాంగ్‌రేప్: దోషులకు 20ఏళ్ల జైలు
జైపూర్: గత ఫిబ్రవరిలో జపాన్‌కు చెందిన 19 ఏళ్ల యువతిపై రాజస్థాన్‌లో సామూహిక అత్యాచారం జరిగిన కేసులో దోషులకు శిక్షపడింది. యువతిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులకు అక్కడి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన ప్రకారం.. జైపూర్‌లోని జల్‌మహల్ ప్రాంతం చూస్తున్నప్పుడు ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు.

‘అతను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడాడు. చాలా మంచిగా ఇక్కడి ప్రాంతాల గురించి వివరిస్తున్నాడని.. అతడు తనకు సాయం చేస్తాడు అనుకున్నాను. కానీ మోసపోయాను' అని పేర్కొంది.
గైడ్‌నని అతన తన స్నేహితులతో కలిసి ఆహారంలో మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అర్ధరాత్రి నగర శివారులో వదిలి వెళ్లిపోయారు. స్థానికుల సహాయంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications