ఐఎస్‌లో చేరడానికి వెళ్తున్న 4గురు యువకుల అరెస్ట్
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్న నలుగురు భారతీయ యువకులను సిరియాలో గుర్తించి, నిర్బంధించినట్లు ఆ దేశ ఉప ప్రధానమంత్రి వాలిద్ అల్ మౌలెమ్ బుధవారం వెల్లడించారు. వారి పేర్లు, భారత్‌లో ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు సిరియాలో పట్టుబడ్డారు అనే వివరాలను మాత్రం ఆయన బయటపెట్టలేదు.
భారత్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన మౌలెమ్ ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌కు చెందిన నలుగురు యువకులు జోర్డాన్ మీదుగా సిరియాలో అడుగుపెట్టారనీ, వారిని డెమాస్కస్‌లో అరెస్టు చేశామనీ చెప్పారు. అయితే వారు భారతదేశంలోని ఏ ప్రాంతం నుంచి వచ్చారనే విషయం మాత్రం ఆయన చెప్పలేదు.

ఇరాక్‌లోని మోసుల్ నగరంలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో బందీలైన 39 మంది భారతీయుల్ని విడిపించే విషయంలో తానెలాంటి సాయం అందించలేనని మౌలెమ్ అశక్తత వ్యక్తం చేశారు. కాగా, ఆ 39మంది భారతీయులను జూన్ 2014లో ఉగ్రవాదులు తమ బందీలుగా చేసుకున్నారు.
వారు ఇరాకీ భద్రతా దళాల అదుపులో ఉంటే విడిపించగలం కానీ, ఉగ్రవాదుల చెరలో ఉంటే మాత్రం ఏమీ చేయలేమని ఆయన తెలిపారు. నిఘా సమాచారాన్ని పంచుకోవడం, ఆర్థిక సాయం అందజేత విషయాల్లో భారత్ నుంచి సానుకూల స్పందన వ్యక్తమయిందని మోసుల్ తెలిపారు. తమపై అమెరికా సహా కొన్ని దేశాలు ఏకపక్షంగా ఆంక్షలు విధించాయనీ వివరించారు.












Click it and Unblock the Notifications