వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగేళ్ల మోడీ సర్కార్: నక్సల్స్ అణచివేతకు హోంమంత్రిత్వ శాఖ చేపట్టిన కీలక చర్యలు..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవలే నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా హోంమంత్రిత్వ శాఖ పలు కీలక సవాళ్లను సమర్థవంతంగా అధిగమించిందని చెబుతున్నారు. అందులో ఒకటి నక్సల్స్ సమస్య కాగా మరొకటి కశ్మీర్ ను వెంటాడుతున్న ఉగ్రవాదం.

హోంమంత్రిత్వ శాఖ బయటపెట్టిన తాజా నివేదికను చూస్తే వామపక్ష తీవ్ర వాదాన్ని అణచివేయడంలో ప్రభుత్వం చాలావరకు విజయం సాధించినట్టే అని చెబుతున్నారు. హింసాత్మక ఘటనలు 36.6శాతం మేర తగ్గాయని, అంటే 6524 నుంచి 4136కి పడిపోయాయని ప్రభుత్వ నివేదిక చెబుతోంది. ఈ నాలుగేళ్లలో నక్సల్స్ ను అణచివేయడానికి ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను ఇప్పుడు చూద్దాం..

4 years of Modi sarkar: How Home Ministry took the fight to the naxals

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు రోడ్డు విస్తరణ:

డిసెంబర్ 2016లో ప్రభుత్వం ఒక ప్రాజెక్టును ప్రకటించింది. దాని పేరు 'నకల్స్ ప్రభావిత ప్రాంతాలకు రోడ్ల అనుసంధానం'. ఇందులో భాగంగా 9 నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లోని 44జిల్లాల్లో 5412కి.మీ మేర రోడ్లను నిర్మించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం రూ.11725 అంచనా వ్యయంగా నిర్ణయించింది. నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటికే 3775.56కి.మీ మేర రహదారిని ప్రభుత్వం నిర్మించగలిగింది.

నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న 35జిల్లాలకు 'కేంద్ర ప్రత్యేక సహాయం':

దేశంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న 35రాష్ట్రాలను గుర్తించి వాటికి కేంద్ర ప్రత్యేక సహాయం కింద రూ.35000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఆ 35జిల్లాల్లో మౌలిక వసతుల సదుపాయం, ప్రభుత్వ సేవల కోసం ఈ బడ్జెట్ ను ఖర్చు చేయనున్నారు. ఇందులో భాగంగా 2017-18 సంవత్సరానికి గాను ఇప్పటికే రూ.175కోట్ల బడ్జెట్ ను విడుదల చేసింది కేంద్రం.

పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు:

మిగతా మంత్రిత్వ శాఖలతో సమన్వయం కోసం హోంమంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ కింద ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేసింది. హోంమంత్రిత్వ శాఖ చేపట్టే కార్యక్రమాలు, వాటి పురోగతిని ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

రెండు కమిటీల ఏర్పాటు:

నక్సల్స్ ఏరివేత చర్యలను మరింత తీవ్రం చేసేందుకు మే 2017లో రెండు కమిటీలను హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.

1) నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అత్యాధునికత సాంకేతిక టెక్నాలజీ(కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ)ని వినియోగించే కమిటీ
2)నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కీలక ఆపరేషన్లను పర్యవేక్షించే(కేపీఐ-కీ పెర్ఫామెన్స్ ఇండికేటర్స్) కమిటీ

ఈ రెండు కమిటీలు ఇప్పటికే హోంమంత్రిత్వ శాఖకు తమ నివేదికలు అందించాయి.

ప్రధాన విజయాలు(భద్రతకు సంబంధించిన సమస్యలు):

హింసాత్మక ఘటనల తగ్గుదల(2010-13&2014-17కి పోల్చి చూస్తే..). గడిచిన నాలుగేళ్లలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ప్రభుత్వ నివేదికలు, అంతకుముందు ప్రభుత్వంలోని నివేదికలను పోల్చి చూస్తే.. మోడీ సర్కార్ స్పష్టమైన పురోగతి సాధించినట్టు కనిపిస్తుంది.

దీనికి సంబంధించిన కొన్ని పారామీటర్స్:

హింసాత్మక సంఘటనలు 36శాతం మేర తగ్గాయి. అంటే 6524 నుంచి 4136కి తగ్గాయి.
నక్సల్స్ సంబంధిత మరణాలు 55.5శాతం మేర తగ్గాయి. అంటే 2428 నుంచి 1081కి తగ్గాయి.
నక్సల్స్ ఏరివేత 14.6శాతం మేర పెరిగింది. అంటే 445నుంచి 510కి పెరిగింది.
నక్సల్స్, వారి అనుచరుల లొంగుబాట్లు 143శాతం పెరిగాయి. అంటే 1387 నుంచి 3373కి పెరిగాయి.

భౌగోళికంగా హింసాత్మక ఘటనలను పరిశీలిస్తే:

రాష్ట్రాల నివేదికలో హింసాత్మక ఘటనలు 10(2013) నుంచి 9(2017)కి పడిపోయాయి.
జిల్లాల నివేదికలో హింసాత్మక ఘటనలు 76(2013) నుంచి 58(2017)కి పడిపోయాయి.
పోలీస్ స్టేషన్ల నివేదికలో హింసాత్మక ఘటనలు 330(2013) నుంచి 291(2017)కి పడిపోయాయి.

సీర్పీఎఫ్ బస్తరియా బెటాలియన్ బలోపేతం:

భద్రతా బలగాల్లో స్థానికుల ప్రాతినిధ్యాన్నిపెంచేలా బస్తరియా బెటాలియన్ ను బలోపేతం చేసింది హోంమంత్రిత్వ శాఖ. తద్వారా అటు ఉపాధి కల్పిస్తూనే.. ఇటు తమ లక్ష్యాలను నెరవేర్చుకుంటోంది. ఇందులో భాగంగా ఛత్తీస్ ఘడ్ లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న నాలుగు జిల్లాలు బీజాపూర్, దంతేవాడ, నారాయణపూర్, సుక్మాలలో 743మంది ఎస్టీలను భద్రతా దళంలో చేర్చుకుంది. ఇందులో 242మంది మహిళలు కూడా ఉండటం గమనార్హం. వాళ్ల రిక్రూట్ మెంటుకు సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయి.. ఇప్పటికే వారి శిక్షణ కూడా పూర్తయినట్టు సమాచారం.

భద్రతకు సంబంధించిన ఖర్చులకై(ఎస్ఆర్ఈ) కేంద్ర సహాయం:

దేశంలోని 106 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాల ఆపరేషన్ల కోసం ఈ పథకం కింద నిధులు కేటాయిస్తారు. గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో(2104-15,2015-16,2016-17,2017-18) రూ.1120.73కోట్లను కేంద్రం విడుదల చేసింది. అంతకుముందు కాంగ్రెస్ హయాంలోని నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో కేవలం రూ.875కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

పోలీస్ స్టేషన్ల బలోపేతం కోసం పథకం:

2010లో ఈ పథకం ఆమోదం పొందింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన 400 పోలీస్ స్టేషన్లకు గాను 386 ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో గత నాలుగేళ్లలోనే 320 పోలీస్ స్టేషన్లు నిర్మించారు.

పురోగతికి సంబంధించి ప్రధాన విజయాలు:

రహదారి సంబంధిత ప్లాన్ ఫేస్-I((RRP-I) (MORTH): RRP-I అనేది రహదారి అనుసంధాన పురోగతి చర్యల్లో భాగం. 8 రాష్ట్రాల్లోని 34 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో దీన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఇందులో ఉన్నాయి. ఈ ఎనిమిది జిల్లాల్లో 5422కి.మీ రహదారులను లక్ష్యంగా పెట్టుకుని రూ.8586కోట్లు కేటాయించారు. ఇందులో 4537కి.మీ రోడ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వీటిల్లో 1608కి.మీ రోడ్లు గత నాలుగేళ్లలో నిర్మించినవే.

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ టవర్ ప్రాజెక్ట్(DoT-డిపార్టుమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్):

2014లో ఈ పథకం ఆమోదం పొందింది. ఈ పథకం కింద నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 2329 టవర్స్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఫేస్-IIలో మరో 4072 మొబైల్ టవర్స్ ఏర్పాటు చేయనున్నారు.

స్కిల్ డెవలప్ మెంట్(MOSDE):

2011లో 34 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2017లొ దీన్ని 47జిల్లాలకు విస్తరించారు. ఇందులో 47ఐటీఐలతో పాటు 68 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీని అంచనా వ్యయం రూ.407.85కోట్లు. ఇందులో ఇప్పటికే 15ఐటీఐ కేంద్రాలను, 43 ఎస్.డి.సీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఆర్థిక కార్యకలాపాలు:

తపాల శాఖ ఆధ్వర్యంలో 32 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో 1789 పోస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో అంతకుముందు 03కి.మీ పరిధిలో ఒక్క పోస్ట్ ఆఫీస్ కూడా లేదు. ఇందులో ఇప్పటికే 565 పోస్టాఫీసులను ఏర్పాటుు చేశారు. అలాగే 35నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో గడిచిన 33నెలల్లో భారత ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో 428 బ్యాంకులు, 1045ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని 2020వరకు పొడగిస్తూ కేంద్రం ఒక నిర్ణయం కూడా తీసుకుంది.

హోంమంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఏ) పథకాలు

భద్రతా పరమైన ఖర్చులకు సంబంధించిన పథకం(ఎస్ఆర్ఈ):

రాష్ట్ర ప్రభుత్వాలు భరించే భద్రతా పరమైన ఖర్చులను కేంద్రం రీయింబర్స్ చేస్తుంది. అంతేకాదు, భద్రతా బలగాల ఆపరేషన్లలో సామాన్యులు లేదా జవాన్లు మరణిస్తే వారికి ఎక్స్ గ్రేషియా అందిస్తుంది. గ్రామ భద్రత కమిటీలకు మౌలిక సదుపాయాలు సమకూరుస్తుంది.

ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం(ఎస్ఐఎస్), 250 పోలీస్ స్టేషన్ల ఆధునీకికరణ కలుపుకుని:

ఈ పథకం కింద స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచెస్ లను బలోపేతం చేస్తారు. అలాగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 250 అత్యాధునిక పోలీస్ స్టేషన్ల నిర్మాణం చేపడుతారు. తదుపరి చర్యల్లో ప్రత్యేక మౌలిక సదుపాయ పథకం కింద మరిన్ని పోలీస్ స్టేషన్లను నిర్మించనున్నారు.

పరిహారం పెంపు:

లొంగిపోయిన నక్సలైట్లకు అప్పటికప్పుడు అందించే పరిహారాన్ని పెంచింది ప్రభుత్వం.

నక్సలైట్ కేడర్ లో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి లొంగిపోతే: రూ.2.5లక్షలు-రూ.5.లక్షలు
కింది స్థాయి కేడర్ అయితే: రూ.1.5లక్షలు-రూ.2.5లక్షలు
ప్రతీ నెల స్టైఫండ్ రూ.4000 నుంచి రూ.6000కి పెంపు

ఎక్స్ గ్రేషియా పెంపు:

భద్రతా బలగాల ఆపరేషన్లలో సామాన్యులు చనిపోతే రూ.1లక్ష నుంచి రూ.2లక్షలు ఎక్స్ గ్రేషియా
జవాన్ ప్రాణాలు కోల్పోతే రూ.3లక్షల నుంచి రూ.20లక్షలు ఎక్స్ గ్రేషియా
స్పెషల్ పోలీస్ ఆఫీసర్లకు ప్రతీ నెలా ఇచ్చే భత్యం రూ.3000 నుంచి రూ.6000కి పెంపు

కొత్తగా చేర్చిన అంశాలు:

ఎక్స్ గ్రేషియా
నక్సల్స్ దాడుల్లో జవాన్లు శాశ్వత వైకల్యానికి గురైతే రూ.5లక్షల పరిహారం
ఆస్తినష్టానికి పరిహారం
సామాన్యులు చనిపోతే రూ.1లక్ష పరిహారం

English summary
The Narendra Modi government completed four years in office. The government has taken several key decisions in the past four years. For the Ministry of Home Affairs, headed by Rajnath Singh, the big challenges were the naxal problem and terrorism especially in the Kashmir Valley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X