పోలింగ్ శాతం దెబ్బేస్తుందా?
4th Phase Lok Sabha election 2024: ఏపీలో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలైంది. ఉదయం 11 గంటల వరకు 23.10 శాతం మేర పోలింగ్ నమోదైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏపీ, తెలంగాణ కలుపుకొని నాలుగో విడతలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేడు ఓటింగ్ కొనసాగుతోంది. బిహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లల్లో మొత్తంగా 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జోరుగా సాగుతోంది.

పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.
ఉదయం 11 గంటల వరకు ఏయే రాష్రంలో ఎంత మేర పోలింగ్ శాతం నమోదైందనే వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ సహా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పోలింగ్ శాతం జాబితాను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది.
దీని ప్రకారం చూస్తే- అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 32.78 శాతం మేర పోలింగ్ నమోదైంది తొలి నాలుగు గంటల వ్యవధిలో. అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్‌ల6 14.94 శాతం మేర రికార్డయింది. ఆంధ్రప్రదేశ్- 23.10, బిహార్- 22.54, జార్ఖండ్- 27.40, మధ్యప్రదేశ్- 32.38, మహారాష్ట్ర- 17.51, ఒడిశా- 23.28, తెలంగాణ- 24.31, ఉత్తరప్రదేశ్- 27.12 మేర పోలింగ్ శాతం మేర పోలింగ్ జరిగింది.












Click it and Unblock the Notifications