బెంగళూరు ఫోరెన్సిక్ ల్యాబ్ డిటోనేటర్ పేలి ఐదు మంది శాస్త్రవేత్తలకు!

బెంగళూరు: బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో డిటోనేటర్ పేలడంతో ఐదు మంది శాస్త్రవేత్తలకు గాయాలైనాయి. డిటోనేటర్ పేలడంతో గాయాలైన ఐదు మంది అధికారులకు చికిత్స చేయిస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డిటోనేటర్లు పరిశీలిస్తున్న సమయంలో పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు.

బెంగళూరు నగరంలోని మడివాళలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో శుక్రవారం స్వాధీనం చేసుకున్న 9 డిటోనేటర్లు పరిశీలిస్తున్ననారు. ఆ సమయంలో ఓ డిటోనేటర్ ఆకస్మికంగా పేలిపోవడంతో ఐదు మంది శాస్త్రవేత్తలకు గాయాలైనాయని తెలిసింది.

5 scientists injured after detonator blast in Forensic Science Laboratory Madiwala

వెంటనే గాయపడిన శాస్త్రవేత్తలను సమీపంలోని ప్రైవేటు ఆసుతప్రికి తరలించామని డీసీపీ ఈషాపంత్, తదితర అధికారులు చెప్పారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డిటోనేటర్లను పరిశీలించి వివరాలు తెలుసుకోవడానికి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తీసుకువచ్చామని అధికారులు అంటున్నారు.

విషయం తెలుసుకున్న బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇటీవల వివిద కేసుల్లో పోలీసులు అనేక పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డిటోనేటర్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+