Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అత్యాచారం, గుజరాత్‌లో ప్రాంతీయ చిచ్చు: వలస కార్మికులపై దాడులు

న్యూఢిల్లీ: గుజరాత్ నుంచి పెద్ద ఎత్తున కార్మికులు, లేబర్లు తమ తమ సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారు. బీహార్, ఉత్తర ప్రదేశ్‌ల నుంచి వచ్చిన వారు వెళ్లిపోతున్నారు. ఇటీవల బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి 14 నెలల పసిపాపపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో గుజరాతీయులు దాడి చేశారు.

ఉత్తర భారతీయ వికాస్ పరిషత్ (మైగ్రాంట్ వర్కర్స్‌కు చెందిన అనుబంధ సంస్థ) శ్యామ్ సింహ్ ఠాకూర్ మాట్లాడుతూ.. తమకు ఆదివారం రోజు 700 బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. యూపీ, బీహార్‌తో పాటు ఉత్తర భారతానికి చెందిన దాదాపు 50వేల మంది గుజరాత్ నుంచి వెళ్లిపోతున్నారని చెప్పారు.

50,000 labourers have left Gujarat already

చిన్నారిపై అత్యాచారం నేపథ్యంలో గుజరాతీయేతరులు లక్ష్యంగా దాడులు మొదలయ్యాయన్న ఆందోళన పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో గుజరాత్‌లో రిజర్వ్ పోలీసు బలగాలను మోహరించినట్లు అధికారులు చెప్పారు.

స్థానికేతరులపై దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలతో దాదాపు 340 మందికి పైగా అరెస్టు చేశారు. గత నెల 28వ తేదీన సాబర్ కాంఠా, గాంధీ నగర్, అహ్మదబాద్, పటన్, మెహనస జిల్లాల్లో హింస చెలరేగింది. దీంతో అత్యాచారం ఘటన నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయని భావిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో యూపీ, బీహార్ నుంచి ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన ఎంతోమంది కార్మికులు గుజరాత్‌ను వదిలి వెళ్తున్నారు.

అయితే, దసరా, దీపావళి సందర్భాలలో ఇలా కూలీలు సొంత ఊర్లకు వెళ్లడం మామూలేనని, దాడులు కారణం కాదని పోలీసులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+