చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో.. ఒకటి కాదు రెండు 526 దంతాలు.. ఏడేళ్ల బాలుడి దవడ నుంచి తీసిన వైద్యులు

|
Google Oneindia TeluguNews

చెన్నై : ఒకటి కాదు రెండు 526 దంతాలు .. ఔను మీరు విన్నది నిజమే. అదీ కూడా ఏడేళ్ల కుర్రాడికి ఇన్ని పళ్లను తీసేశారు వైద్యులు. ఇందుకోసం దాదాపు 5 గంటల సమయం పట్టిందని వివరించారు. చెన్నైలో జరిగిన ఈ ఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా 32 పళ్లు తెలుసు .. ఒకటి రెండు అటు, ఇటు తెలుసు .. కానీ ఏకంగా 500 పళ్లు ఉండటం, వాటిని వైద్యులు తొలగించడం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది.

చెన్నైలో ఓ దంపతులు నివసిస్తున్నారు. వారికి బాబు ఉన్నాడు. అయితే అతనికి చిన్నప్పటి నుంచి దంత సమస్య ఉంది. మూడేళ్ల వయస్సు అప్పుడు పంటిలో నొప్పి అంటే తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ వయస్సు పెరిగే కొద్దీ ఇబ్బంది ఎక్కవవుతుంది. ఏడేళ్ల వయస్సు వచ్చేసరికి నొప్పి భరించరానంతగా మారింది. దీంతో పేరెంట్స్ సవిత దంత వైద్యులను సంప్రదించారు. దీంతో వారు ఎక్స్ రే తీస్తే విస్తుపోయే నిజం బయటపడింది. అతనికి ఎక్కువ పళ్లు ఉన్నట్టు గుర్తించారు. దీనిని 'కంపౌండ్ కంపోజిట్ అన్‌డోన్‌టోమ్' అనే వ్యాధి ఉన్నట్టు గుర్తించారు.

526 teeth in a 7-year-olds mouth! Chennai doctors remove them all

వైద్యులు బాలుడికి శస్త్ర చికిత్స నిర్వహించారు. దాదాపు 5 గంటలు కష్టపడి 526 పళ్లను బయటకు తీశారు. ఎక్స్ రేతోపాటు సీటీ స్కాన్ కూడా తీశామని వైద్యుడు సెంథిల్ నాథన్ పేర్కొన్నారు. 526 పళ్లలో చిన్న, పెద్దవి, మధ్యవి కూడా ఉన్నాయని వైద్యులు తెలిపారు. వీటి బరువు 200 గ్రాములు ఉంటుందని వివరించారు. తొలుత ఒక్కో పన్ను బయటకు తీశామని .. అయితే వరుసగా దంతాలు ఉండటంతో అర్థం కాలేదన్నారు. చివరికి అవి అన్ని కలిసి 526కు చేరాయని వెల్లడించారు.

English summary
doctors have extracted an astounding 526 teeth from the mouth of a seven-year-old boy in a rare surgery performed at the city's Saveetha Dental College and Hospital, doctors said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X