సుధీంద్ర కులకర్ణిపై సిరా దాడి: ఆరుగురి అరెస్టు

ముంబై: అబ్జర్వర్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ సుధీంద్ర కులకర్ణిపై సోమవారం సిరాతో దాడి చేసిన వారిలో ఆరుగురు శివసేన కార్యకర్తలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌ మాజీ మంత్రి ఖుర్షిద్‌ మహ్మద్‌ కసూరి రాసిన పుస్తకం ఆ విష్కరణ కార్యక్రమం సోమవారం ముంబై వచ్చిన విషయం తెలిసిందే.

కాగా, ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ శివసేన పార్టీ శ్రేణులు సుధీంద్ర కులకర్ణి ముఖంపై నలుపు రంగు సిరా పోసి బెదిరించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

6 Shiv Sena workers get bail in Sudheendra Kulkarni ink attack case

సుధీంద్ర కులకర్ణి మాత్రం తన ముఖంపై పడిన నల్లరంగుతో మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఘటనపై సోమవారం సాయంత్రం పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆయనపై సిరాతో దాడి చేసిన ఆరుగురు శివసేన కార్యకర్తలను మంగళవారం ఉదయం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ ఆరుగురికి బెయిల్‌ మంజూరైంది.

కాగా, శివసేన కార్యకర్తల హెచ్చరికల నేపథ్యంలో భారీ భద్రత నడుమ మధ్య ముంబైలో కసూరి పుస్తకాన్ని ఆవిష్కరించారు కులకర్ణి. కులకర్ణిపై శివసేన కార్యకర్తల దాడిని దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీలు, మేధావులు, మీడియా తీవ్రంగా తప్పుబట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+