వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భాగస్వాముల్ని హింసిస్తున్నారు!: మగవాళ్ల అంగీకారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

 60% of Indian men admit violence against wives: UN report
న్యూఢిల్లీ: భారత దేశంలో అరవై శాతం మంది పురుషులు తమ భార్యలను లేదా భాగస్వాములను హింసిస్తున్నారట. తాము హింసను ఎదుర్కొంటున్నామని 52 శాతం మంది మహిళలు చెప్పారట. ఈ విషయం ఐక్యరాజ్య సమితి రిపోర్ట్ తెలిపింది. భారత్‌లోని ప్రతి పదిమంది భర్తలలో ఆరుగురు తమ భార్యను హింసిస్తున్నట్లు అంగీకరించారు.

దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఈ మేరకు అధ్యయనం నిర్వహించినట్లు ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌పీఏ) భారత విభాగం అధిపతి ఫ్రెడరికా మీజర్‌ తెలిపారు. బాలుర స్థాయి నుంచి పురుషులదాకా లైంగిక సమానత్వంపై అవగాహన పెంచే పటిష్ఠ కార్యక్రమాల రూపకల్పనే దీని లక్ష్యమన్నారు.

సోమవారం విడుదలైన అధ్యయన నివేదిక ప్రకారం... పురుషులనుంచి అభిప్రాయాలు సేకరించారు. బెదిరింపులు, తోయడం, అవమానం, ఎద్దేవా, కొట్టడం, అత్యాచారం వంటి శారీరక - లైంగిక దుశ్చర్యలకు పాల్పడటాన్ని వారు హింసగా పేర్కొన్నారు. భార్యను ఉద్యోగం చేయనివ్వకపోవడం లేదా ఆమె సంపాదనను లాక్కోవడం కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

మహిళలను కూడా దీనిపై ప్రశ్నించగా, వారిలో 52 శాతం చిన్నతనం నుంచీ వైవాహిక జీవితం దాకా గడచిన కాలంలో ఎప్పుడో ఒకప్పుడు హింసకు గురైనట్లు చెప్పారు. వీరిలో 38 శాతం తమ భర్త లేదా కుటుంబంలోని మగవారి చేతిలో బాధలుపడినట్లు వివరించారు.

కాగా, ఈ సర్వేలో తొమ్మిదివేల మందికి పైగా మగవారు, మూడువేల మందికి పైగా ఆడవారు పాల్గొన్నారు. వారు 18-49 ఏల్ల వయసు మధ్య ఉన్నారు.

ఈ రిపోర్ట్ ప్రకారం ఎక్కువ స్థాయిలో ఒడిశా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో 70 శాతానికి పైగా హింసను మహిళలు ఎదుర్కొంటున్నారు. కాగా, మహిళలను హింసిస్తున్న పురుషులలో చిన్నతనంలో వివక్షకు గురైన లేదా ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నవారుగా అధ్యయన నివేదిక పేర్కొంది.

English summary
Sixty percent of Indian men admit acting violently against their wife or partner at some point in their lives while 52 percent of women admit having faced some form of violence during their lifetime, says a UN report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X