• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

20ఏళ్లు చిన్నవాడైన యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కిన సీఎం రమణ్ సింగ్(వీడియో)

|
  20ఏళ్లు చిన్నవాడైన యోగి ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కిన సీఎం రమణ్ సింగ్(వీడియో)

  రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ (66).. రాజ్‌నందగావ్ నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇందుకోసం ఆయన తన భార్య వీణా సింగ్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, బీజేపీ ఛత్తీస్‌గఢ్‌ ఇన్‌ఛార్జీ అనిల్‌ జైన్, ఇతర పార్టీ నేతలతో కలిసి కలెక్టరేట్‌ వద్దకు వెళ్లారు.

  యోగి పాదాలను తాకిన సీఎం రమణ్ సింగ్

  కాగా, నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం సీఎం రమణ్ సింగ్.. తన కంటే 20 ఏళ్లు చిన్నవాడైన యోగి ఆదిత్యనాథ్ (46) కాళ్లను మొక్కారు. అయితే రాజకీయ రంగంలోనూ ఆయన కన్నా రమణ్‌ సింగ్‌ చాలా సీనియర్‌. 2003 నుంచి ఆయన ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా ఉంటోన్న విషయం తెలిసిందే.

   యోగి పుట్టకముందే బీజేపీలో రమణ్ సింగ్..

  యోగి పుట్టకముందే బీజేపీలో రమణ్ సింగ్..

  రమణ్ సింగ్ విద్యార్థిగా ఉన్న సమయంలోనే 1970లో భారతీయ జన సంఘ్‌లో చేరారు. అనంతరం 1976-77 కాలంలో ఆ పార్టీ యువ విభాగ అధ్యక్షుడయ్యారు. కాగా, యోగి ఆదిత్యనాథ్‌ 1972లో జన్మించారు. ‌ ‌కాగా, రాజ్‌నందగావ్ నుంచి రమణ్‌ సింగ్‌ ఇప్పటికి రెండుసార్లు పోటీ చేసి గెలిచారు.

   రమణ్ సింగ్‌పై వాజపేయి మేనకోడలు పోటీ..

  రమణ్ సింగ్‌పై వాజపేయి మేనకోడలు పోటీ..

  ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలనుకుంటున్నారు. రాజ్‌నందగావ్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ తమ అభ్యర్థిగా భారత మాజీ ప్రధాని వాజ్‌పేయీ మేనకోడలు కరుణా శుక్లాను పోటీకి దింపనుంది.

  నాలుగోసారి బీజేపీదే అధికారం

  నాలుగోసారి బీజేపీదే అధికారం

  మంగళవారం నామినేషన్‌ వేసిన అనంతరం రమణ్‌ సింగ్‌ మాట్లాడుతూ... బూత్‌ స్థాయి నుంచి పార్టీ బలంగా ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లోనూ గెలిచి బీజేపీని రాష్ట్రంలో నాలుగోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారని చెప్పారు.

  యోగి ప్రచారం

  యోగి ప్రచారం

  ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ పలు బహిరంగసభల్లో పాల్గొని ప్రసంగించారు. రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. కాగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నవంబరు 12న జరగనున్న మొదటి దశ ఎన్నికలకుగానూ నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ రోజే చివరిరోజు. ఆ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. రెండో దశ ఎన్నికలు నవంబరు 20న జరుగుతాయి. ఫలితాలు డిసెంబరు 11న వెల్లడవుతాయి.

  షాకింగ్: రెస్టారెంట్‌లో 2గ్లాసుల నీళ్లు ఆర్డర్ చేసి రూ. ఏడున్నర లక్షలు టిప్ ఇచ్చాడు!

  స్మార్ట్‌ఫోన్‌కి బానిసైన యువతి: చేతి వేళ్లు వంగిపోయాయి!, చికిత్స చేసిన వైద్యులు, జాగ్రత్త!

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Chhattisgarh CM Raman Singh today filed his nomination for the upcoming assembly elections in the state. The veteran BJP leader filed his nomination from Rajnandgaon constituency. He submitted his nomination papers to the collector and district magistrate Bhim Singh in the presence of Uttar Pradesh Chief Minister Yogi Adityanath and other officials.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more