మరో మూక దాడి: 70 ఏళ్ల వయోవృద్ధుడిని కొట్టి చంపారు: స్తంభానికి కట్టేసి మరీ..!
రాంచీ: దేశంలో మూకదాడులు అడ్డూ, అదుపు లేకుండా కొనసాగుతునే ఉన్నాయి. తబ్రేజ్ హత్యోదంతం అనంతరం చోటు చేసుకున్న పరిణామాల వల్ల మూక దాడులకు బ్రేక్ పడుతుందని ఆశించినప్పటికీ.. దానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. యథేచ్ఛగా మూకదాడులను కొనసాగిస్తున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా 70 సంవత్సరాల వృద్ధుడి కరెంటు స్తంభానికి కట్టేసి మరీ చొతగ్గొట్టారు. ఫలితంగా- ఆ వృద్ధుడు సంఘటనాస్థలంలోనే మరణించాడు. జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బెల్బాడ్ తాలూకాలో కొండప్రాంతమైన కుచి పహారీ గ్రామంలో చోటు చేసుకుంది. వన మూలికలను ఏరుకోవడానికి వెళ్లిన వృద్ధుడు సాయంత్రం తిరిగి వస్తుండగా.. కుచి పహారీ గ్రామస్తులు అతణ్ని అడ్డగించారు.
పిల్లలను ఎత్తుకెళ్లే వాడిగా అనుమానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలను ఇవ్వలేకపోయాడా వృద్ధుడు. దీనితో అనుమానం మరింత రెట్టింపు కావడంతో అతణ్ని కరెంటు స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే మీర్జాచౌకీ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు.

అప్పటికే ప్రాణాపాయ స్థితికి చేరుకున్న అతణ్ని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మరణించాడు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తున్న కొందరు గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు సాహిబ్ గంజ్ సబ్ డివిజినల్ పోలీస్ అధికారి నావల్ శర్మ తెలిపారు. నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. వారిపై మీర్జాచౌకి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications