రైలు ప్రమాదం: 10 మంది మృతి.. బండరాయిని ఢీ కొనడం వల్లే?
బెంగుళూరు: కర్ణాటకలోని హోసూరు వద్ద బెంగుళూరు-ఎర్నాకుళం ఇంటర్ సిటీ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ట్రాక్ నుంచి పక్కకు 8 బోగీలు ఒరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. డీ-8 బోగీ పూర్తిగా దెబ్బతినట్లు తెలుస్తోంది.
పట్టాలపై ఉన్న పెద్ద బండరాయిని ఢీకొట్టడంతో రైలు ఇంజన్‌లో మంటలు చెలరేగిన నేపథ్యంలో దాని వెనుక ఉన్న బోగీలన్నీ పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. అసలు బండరాయి రైలు పట్టాలపైకి ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్టీఆర్ఎఫ్ బృందాలను సహాయక చర్యల నిమిత్తం అక్కడికి తరలించారు.
ప్రమాదంలో మరణించిన ముగ్గురు ప్రయాణీకులు మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో 23 మందికి తీవ్ర గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. రైలు పట్టాలు తప్పడంతో బెంగుళూరు-ఎర్నాకుళం మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంగ గౌడ ఘటనాస్ధలికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు.
ఆ తర్వాత రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా ఘటనా స్ధలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సురేష్ ప్రభు, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు, స్వల్పంగా కాయపడ్డ వారికి రూ. 20 వేలను అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బెంగుళూరు-ఎర్నాకుళం రైలు ప్రమాదం పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
హోసూర్‌లో ఈరోజు ఉదయం జరిగిన బెంగళూరు-ఎర్నాకుళం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన ప్రయాణీకుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢసానుభూతి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పట్టాలు తప్పిన బెంగుళూరు-ఎర్నాకుళం రైలు
కర్ణాటకలోని హోసూరు వద్ద బెంగుళూరు-ఎర్నాకుళం రైలు పట్టాలు తప్పింది. ట్రాక్ నుంచి పక్కకు 8 బోగీలు ఒరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.

పట్టాలు తప్పిన బెంగుళూరు-ఎర్నాకుళం రైలు
ఈ ప్రమాదంలో 23 మందికి తీవ్ర గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పట్టాలు తప్పిన బెంగుళూరు-ఎర్నాకుళం రైలు
ప్రమాదంలో మరణించిన ముగ్గురు ప్రయాణీకులు మృతదేహాలను వెలికితీశారు. రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రమాద ప్రాంతానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

పట్టాలు తప్పిన బెంగుళూరు-ఎర్నాకుళం రైలు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్టీఆర్ఎఫ్ బృందాలను సహాయక చర్యల నిమిత్తం అక్కడికి తరలించారు. రైలు పట్టాలు తప్పడంతో బెంగుళూరు-ఎర్నాకుళం మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications