ఆన్ లైన్ లో కాల్ గర్ల్ ను బుక్ చేసిన టెక్కీ, బెంగళూరు లగ్జరీ హోటల్ లో ఏం జరిగిందంటే ?

ఆన్‌లైన్‌ మోసాల కేసులు విపరీతంగా పెరుగుతున్నా ప్రజలు ఏమాత్రం మేల్కోవడం లేదు. ఎక్కువగా చదువుకున్న వారే ఇలాంటి ఆన్ లైన్ మోసపూరిత నెట్‌వర్క్‌లలో పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకోవడం విచారకరం అని పోలీసు అధికారులు అంటున్నారు. ఇలాంటి మరో మరో ఘటనలో బెంగళూరు టెక్కీ ఆన్‌లైన్‌లో కాల్ గర్ల్‌ను బుక్ చేసేందుకు వెళ్లి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు.

ఒక టెక్కీ ఇంటర్నెట్‌లో అమ్మాయిల కోసం వెతుకుతున్నప్పుడు ఓ వెబ్‌సైట్‌ చూశాడు. ఆ వెబ్‌సైట్‌లో యువతుల నగ్న చిత్రాలు, వీడియోలు ఉన్నాయి. ఈ యువతులతో శారీరక సంబంధాన్ని పెట్టుకోవచ్చి, అమ్మాయిలను బుక్ చేసుకోవచ్చని అందులో మొబైల్ నంబర్ కూడా ఇచ్చారు. ఇది చూసిన టెక్కీ ఆ నంబర్‌కు సంప్రదించి వెంటనే సమాచారం తెలుసుకున్నాడు. ఏ యువతిని బుక్ చేసుకున్నా రూ. 5 వేలు ధర నిర్ణయించినట్లు ఆ కేటుగాళ్లు తెలిపారు.

A Bengaluru techie who lost lakhs of rupees to book a call girl.

టెక్కీని మొదట నమ్మించడానికి ప్రయత్నించిన నటించిన నిందితులు మీకు మా సర్వీస్ పూర్తయిన తర్వాత, అమ్మాయితో మీరు ఎంజాయ్ చేసిన తరువాత రూ. 5, 000 చెల్లించవచ్చని, ముందుగా బుక్ చేసుకోవడానికి రూ. 500 మాత్రం చెల్లించాలని సమాచారం ఇచ్చారు. టెక్కీలకు కూడా డిజిటల్ పేమెంట్ యాప్ ద్వారా నిందితులకు రూ. 500 చెల్లించాడు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకి సమీపంలో ఉన్న ఓ హోటల్ లొకేషన్‌ను పంపించిన నిందితులు ఆ టెక్కీని అక్కడికి రమ్మని చెప్పారు.

శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ఆ వ్యక్తి ఆ హోటల్‌కు వెళ్లాడు. ఈ సమయంలో నిందితులు మీరు ఇవ్వాల్సిన మిగిలిన బకాయి రూ.4,500 వెంటనే చెల్లించాలని, తరువాత అమ్మాయిని పంపిస్తామని డిమాండ్ చేశారు. టెక్కీ ఆవేశంలో అమ్మాయి మీద మోజుతో వెంటనే రూ. 4, 500 చెల్లించాడు. ఆ తర్వాత అదనంగా రూ.8, 900. డబ్బులు చెల్లించాలని నిందితులు ఆ టెక్కీని డిమాండ్ చేశారు. ఈ డబ్బు సెక్యూరిటీ డిపాజిట్ అని, కాల్ గర్ల్‌తో శారీరక సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత ఈ డబ్బును తిరిగి ఇస్తానని ఆ టెక్కీకి చెప్పాడు.

నిందితుడి మాటలు నమ్మిన టెక్కీ మోసగాళ్లు చెప్పినట్లే వాళ్లు అడిగిన డబ్బు చెల్లించాడు. అనంతరం ఆధార్ వెరిఫికేషన్ సాకుతో మళ్లీ రూ.13, 500 చెల్లించాలని కోరాడు. వెరిఫికేషన్ తర్వాత త్వరగా డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం అని టెక్కీకి చెప్పారు. అప్పుడు ఆ టెక్కీకి అనుమానం వచ్చింది. కానీ అప్పటికే ఎక్కువ డబ్బులు ఇచ్చేసిన టెక్కీ ఏం చెయ్యాలో తెలీక మొదట అయోమయంలో పడిపోయాడు.

A Bengaluru techie who lost lakhs of rupees to book a call girl.
అమ్మాయితో ఎంజాయ్ చేసిన తరువాత సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇచ్చేస్తారని టెక్కీ అనుకున్నాడు. ఆధార్ వెరిఫికేషన్ కోసం రూ. 13,500 రూపాయలు టెక్కీ అతనికి ఇచ్చాడు. అనంతరం యువతి గుర్తింపు కార్డును వెరిఫై చేసేందుకు డబ్బులు అడిగారు. ఇలా పలుమార్లు ఏదో ఒక కారణం చెప్పి వేల రూపాయలు ఆ టెక్కీ నుంచి లాక్కొన్నారు. ఇలా ఆటెక్కీని వెరిఫికేషన్ పేరుతో మోసం చేశారు.

చివరికి కాల్ గర్ల్ వివరాల వెరిఫికేషన్ అంటూ ఆట మొదలుపెట్టారు. మరోసారి కాల్ గర్ల్ బుకింగ్ సంస్థ యొక్క ఆర్థిక విభాగం ఫైనల్ వెరిఫికేషన్ సాకుతో ఆటెక్కీ నిందితుడికి మరో రూ.19,500 కూడా చెల్లించాడు.వెంటనే కొంత డబ్బు వాపస్ ఇచ్చిన నిందితుడు మరోసారి ఆ టెక్కీని ఒప్పించి మళ్లీ రూ. 30 వేలు ఇవ్వాలని కోరాడు. దీని తర్వాత టెక్కీ అతని ఖాతాను తనిఖీ చేయగా అతను అప్పటికే మొత్తం లక్షన్నర రూపాయలు పోగొట్టుకున్నట్లు గుర్తించాడు.

మోసపోయానని గ్రహించిన టెక్కీ వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. బెంగళూరులోని అడుగోడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం మీద కాల్ గర్ల్ బుక్ చేసుకుని ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న బెంగళూరు టెక్కీ ఇప్పుడు లక్షలాది రూపాయాలు పోగొట్టుకుని లబోదిబో అంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+