టిక్కెట్ అడిగితే చితకబాది చంపేస్తామని బెదిరించారు, ఆర్ టీసీ మేనేజర్, సిబ్బందిపై ఎఫ్ఐఆర్!
ప్రజలకు రవాణా సేవలను అందించే కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన అధికారి, సిబ్బంది కలిసి ప్రయాణికుడిపై దాడి చేసి హత్య చేస్తామని బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. టికెట్ ఇవ్వడంపై రచ్చకెక్కిన గొడవ ఇప్పుడు ప్రాణహాని వరకు చేరింది. దీంతో కేఎస్ఆర్ టీసీ మేనేజతో సహ సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడం కలకలం రేపింది.
రాత్రి చిత్రదుర్గ జిల్లా హిరియూరుకు చెందిన రాఘవేంద్ర అనే వ్యాపారి ఊరికి వెళ్లడానికి బెంగళూరులోని మెజెస్టిక్‌లోని కేఎస్‌ఆర్‌టీ బస్ టెర్మినల్‌కు వచ్చాడు. అక్కడి నుంచి హరిహర వెళ్లే బస్సు ఎక్కిన వ్యాపారి రాఘవేంద్ర హిరియూరికి టిక్కెట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆర్ టీసీ బస్సులో టికెట్ ఇచ్చే విషయంలో కేఎస్ఆర్ టీసీ సిబ్బంది తన మీద దాడి చేశారని ప్రయాణికుడు రాఘవేంద్ర కేసు పెట్టాడు. ప్రయాణికుడిపై దాడి చేసి చంపుతామని బెదిరించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

హిరియూరికి టికెట్ అడగగా ఈ బస్సు హిరియూరికి వెళ్లదని, బైపాస్ మీదుగా వెళ్తుందని కండెక్టర్ రాఘవేంద్రకు చెప్పాడు. బైపాస్‌లో దిగుతానని చెప్పిన రాఘవేంద్ర టిక్కెట్ ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో కండక్టరు చిత్రదుర్గకు టిక్కెట్టు తీసుకోవాలని బెదిరించాడు. తాను హిరియూరులో దిగుతానని, చిత్రదుర్గ టికెట్ ఎందుకు తీసుకోవాలని ప్రయాణికుడు ప్రశ్నించారు. అందుకు అంగీకరించని ఆ బస్సు కండక్టర్ రాఘవేంద్రను బస్సు నుంచి కిందకు దించేయడానికి ప్రయత్నించాడని ఆరోపణలు ఉన్నాయిడు..
హిరియూరుకు చిత్రదుర్గకు మధ్య 43 కిలోమీటర్ల దూరంగా ఉంది. హిరియూరులో దిగాల్సిన వారికి పక్క ఊరు టిక్కెట్టు ఎందుకు ఇస్తారు అని రాఘవేంద్రతో పాటు కొందరు ప్రయాణికులు ప్రశ్నించారు. తరువాత విసిగిపోయిన ప్రయాణికుడు రాఘవేంద్ర బస్సు దిగి వెళ్లి కేఎస్ఆర్ టీసీ డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. డిపో మేనేజర్ అదే డైలాగ్ రిపీట్ చేశాడు. హిరియూరికి టిక్కెట్టు లేదు, మీరు చిత్రదుర్గ టిక్కెట్టు తీసుకోవాలి అని రాఘవేంద్రకు తేల్చిచెప్పారు.

ఆసమయంలో రాఘవేంద్ర డిపో మేనేజర్‌తో సంభాషణను వీడియో చేయడం ప్రారంభించాడు. ఇది గమనించిన అక్కడే ఉన్న సతీష్ అనే సెక్యూరిటీ గార్డు రాఘవేంద్ర మొబైల్ ఫోన్ లాక్కొని కర్రతో కొట్టి, అతని ఛాతిపైన తన్ని కేఎస్ఆర్ టీసీ డిపోమేనేజర్ రూమ్ రూమ్ లో నుంచి బయటికి ఈడ్చేశాడు. మాపై దాడి చేశారని రాఘవేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. KSRTC సిబ్బంది నుండి తనకు ప్రాణహాని ఉందని రావేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
డిపో మేనేజర్ గదిలోకి లాగిన సిబ్బంది సతీష్, మేనేజర్ తనపై దాడి చేశారని, సతీష్ మాట్లాడుతూ నేను కూడా హిరియూరుకు చెందిన వాడే అని, నా సోదరుడు పెద్ద గూండా అని, నిన్ను హిరియూరులోనే చంపేస్తామని సెక్యూరిటీ గార్డు సతీష్ తనను బెదిరించాడు, తనను చంపేస్తానని బెదిరించాడని రాఘవేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ) మేనేజర్, సిబ్బందిపై బెంగళూరు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications