ప్రేమ పెళ్లి: పెద్దల నిరాదరణతో జంట ఆత్మహత్య
భువనేశ్వర్: పెద్దలు అంగీకరించడంతో వారికి దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుని జీవిస్తున్నారు ఇద్దరు యువతీయువకులు. కొంతకాలం తర్వాత ఇంటికొచ్చినా.. ఆ జంటకు పెద్దల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. అంతేగాక, వారిని పట్టించుకోకుండా నిరాదరణకు గురిచేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గుమ్మసమితి ఉక్కుర పంచాయతీ అనుకంప గ్రామానికి చెందిన బిజి బిరువా(26), రాయగడ గ్రామానికి చెందిన సాయిబానీ గొమాంగో(24) కొన్నేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. వేర్వేరు సామాజిక వర్గాలు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారిని ఎదురుంచి పెళ్లి చేసుకుని ముంబై వెళ్లిపోయారు.

పదేళ్ల తర్వాత రెండ్రోజుల క్రితం బిజిబిరువా స్వగ్రామమైన అనుకంప గ్రామానికి వచ్చారు. అయితే, అతని కుటుంబసభ్యులు, బంధువులు వారిని ఏమాత్రం ఆదరించలేదు.
కులాంతర వివాహం, ఇతర పట్టింపులతో పెద్దలు నిరాదరణ గురిచేయడంతో వారిద్దరూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గ్రామ శివారులోని చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications