ఫ్రెండ్స్ చేసిన పనికి దంపతులు ఏం చేశారంటే ?, సోషల్ మీడియాలో వీడియో వైరల్
అప్పు చేసి పప్పు కూడు అనే సామెత చాలా మందికి వర్థిస్తుంది. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం ప్రాణం మీదకు వస్తుందని చాలాసార్లు వెలుగు చూసింది. తీసుకున్న రుణం సరైన సమయంలో తీర్చకపోతే అప్పులు ఇచ్చిన వాళ్లు ఎన్ని వేదింపులకు గురి చేస్తారో పెద్దగా చెప్పనవసరం లేదు. అయితే తెలిసిన వ్యక్తులకు అప్పుగా డబ్బులు, బంగారు నగలు ఇచ్చిన పాపానికి దంపతుల ఈ లోకం వదిలి వెళ్లిపోయారు.
అప్పు తీసుకున్న వ్యక్తి ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం, బంగారు నగలు తీసుకున్న వ్యక్తి మోసం చెయ్యడంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలోని మైసూరు నగరంలోని యరగనహళ్లిలో చోటుచేసుకుంది. విశ్వ (34), సుష్మా (28) దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విశ్వ, సుష్మా దంపతులు ఆత్మహత్య చేసుకునే ముందు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చెయ్యడంతో అది వైరల్ అయ్యింది. మా ఆత్మహత్యలకు ఇద్దరు వ్యక్తులు కారణం అని ఆ దంపతులు వీడియోలో చెప్పారు.

అయితే దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వ, సుష్మా దంపతులు శివ అనే వ్యక్తి చాలాకాలం నుంచి పరిచయం ఉన్నాడు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని, తనకు డబ్బలు అవసరం అయ్యిందన, తనకు మూడు లక్షలు అప్పు ఇవ్వాలని విశ్వను వేడుకున్నాడు. శివ మాయమాటలు నమ్మిన విశ్వ, సుష్మా దంపతులు వేరొకరి వద్ద అప్పు చేసి అతనికి రూ 3 లక్షలు ఇచ్చినట్లు తెలిసింది.తరువాత విశ్వ దగ్గర మరో రెండు లక్షలు తీసుకున్న శివ అతని సొంత ఖర్చులకు వాడుకున్నాడని తెలిసింది.
విశ్వ, సుష్మా దంపతుల దగ్గర సుమారు 5 లక్షల వరకు అప్పు తీసుకున్న శివ చెప్పిన టైమ్ కు వారికి తిరిగి డబ్బు చెల్లించలేదు. కానీ ఇక్కడ అప్పులు ఇచ్చివాళ్లు తిరిగి డబ్బులు ఇవ్వాలని విశ్వ, సుష్మా దంపతులను అడిగారు. అయితే శివ మాత్రం తన దగ్గర డబ్బులు లేవని, తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు తిరిగి ఇస్తానని ఎదరుతిరగడంతో విశ్వ, సుష్మా దంపతులు హడలిపోయారు. ఇదే విషయంలో డబ్బులు ఇచ్చిన వాళ్ల ఒత్తిడి ఎక్కువ కావడంతో మనస్తాపం చెందిన విశ్వ, సుస్మా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అంతేకాకుండా కూరగాయల వ్యాపారం చేస్తూ కష్టపడి డబ్బు సంపాధించి ఆడబ్బుతో కొనుకున్న బంగారు నగలను చోరనహళ్లి రాజన్నకు ఇచ్చామని, అతనుకూడా బంగారం తిరిగి ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశాడని విశ్వ, సుష్మా దంపతులు ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన వీడియోలో ఆరోపించారు. మాయమాటలు చెప్పి డబ్బులు, బంగారు నగలు తీసుకుని మోసం చెయ్యడంతో ఆవేదనతో విశ్వ, సుష్మా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని, దంపతులు వీడియోలో మొత్తం చెప్పారని, శివ, రాజన్నల మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని మైసూరు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications