తెల్లారితే పెళ్లి! బెడ్‌పై మరో వ్యక్తితో కూతురు, హత్య
న్యూఢిల్లీ: తెల్లారితే కూతురు పెళ్లి. దీంతో ఆ ఇంట్లోని కుటుంబసభ్యులంతా షాపింగ్ కోసం బయటికి వెళ్లారు. పెళ్లి కూతురు మాత్రం ఇంట్లోని ఉండిపోయింది. అయితే, షాపింగ్‌కి వెళ్లి వచ్చిన తల్లి.. తన కూతురును చూడకూడని స్థితిలో చూసింది. దీంతో ఆగ్రహం పట్టలేక ఆమెను కుటుంబసభ్యుల సాయంతో దారుణంగా హత్య చేసింది.
న్యూఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తన భర్త చనిపోవడంతో ఆ మహిళే తన పిల్లలను పెంచి పెద్ద చేసింది. తన కూతురును ఓ వ్యాపారితో వివాహం చేసేందుకు నిశ్చయించింది. తెల్లారితే కూతురు పెళ్లి కావడంతో షాపింగ్ చేసేందుకు బయటికి వెళ్లింది.
తిరిగి వచ్చే చూసే సరికి కూతురు కనిపించలేదు. ఇల్లంతా సమీప బంధువులతో సందడిగా ఉంది. కూతురు కోసం వెదికిన తల్లికి ఆ కూతురు చూడకూడని స్థితిలో కనిపించింది. కూతురు తమ ఇంట్లో అద్దెకుండే వ్యక్తితో ఓ పడక గదిలో అసభ్యకరస్థితిలో కనిపించింది. దీంతో ఆ తల్లి ఆవేశం కట్టలు తెంచుకుంది.

వెంటనే ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. కొడుకును గదిలోకి పిలిచి జరిగిన విషయం చెప్పింది. ఇంటినిండా బంధువులు ఉండటంతో వాళ్లతో కూతురు లోబీపీతో పడిపోయిందని, గుండెపోటు వచ్చిందని చెప్పి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆ తల్లి అసలు విషయం చెప్పింది. దీంతో ఆ తల్లి, కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, తమ ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తితో ఆమె కూతురికి చాలా కాలం నుంచి శరీరక సంబంధం ఉందని తేలింది. పెళ్లితో కళకళలాడాల్సిన ఆ ఇల్లు.. కూతురు హత్య, తల్లీకొడుకుల అరెస్టుతో ఆ నిశ్శబ్దంగా మారిపోయింది.












Click it and Unblock the Notifications