90 ఏళ్ల వృద్దుడి కిడ్నాప్...! మత్తుమందు ఇచ్చి ఫ్రిజ్‌లో కుక్కిన దుండగులు...!
ఢిల్లీలో దారుణం జరిగింది. కనీసం వయస్సుకు విలుక ఇవ్వని దుండగులు తొంబై ఎళ్ల వృద్దుడిని డబ్బు కోసం కిడ్నాప్ చేశారు. అది కూడ మత్తు మందు ఇచ్చి ఫ్రిజ్‌లో పెట్టుకుని తీసుకెళ్లిన సంఘటన ఢిల్లీ చోటుచేసుకుంది. ఇంట్లో పనిచేసే యువకుడే మత్తు మందు ఇచ్చి కిడ్నాప్‌కు సహకరించాడు. నమ్ముకున్న పని మనిషి, నమ్మకద్రోహానికి దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

డిల్లీలో దారుణం
సౌత్ ఢిల్లీలో దుండగులు దారుణానిక పాల్పడ్డారు. తొంబై ఏళ్ల వృద్దుడికి మత్తుమందు ఇచ్చి ఫ్రిజ్ కుక్కి కిడ్నాప్ చేశారు. 90 సంవత్సరాల క్రిషన్ కోస్లా అనే రిటైర్ ఉద్యోగి తన భార్యతో కలిసి సౌత్ ఢిల్లీలోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వారిఇద్దరు కుమారుల్లో ఒకరు విదేశాల్లో ఉండగా మరో కుమారుడు ఢిల్లీలో పారిశ్రామికవేత్త వృద్దదంపతులకు తోడుగా ఇంట్లో పనిచేసేందుకు ఓ 20 యువకున్ని సంవత్సరం క్రితం నియమించుకున్నారు.

ఫ్రిజ్ లో కిడ్నాప్ పన్నాగం
ఈ నేపథ్యంలోనే గత శనివారం ఇంట్లో పనిచేసే యువకుడు శనివారం సాయంత్రం ఇద్దరు దంపతులకు టీలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. వారు గాఢా నిద్రలోకి వెళ్లిన అనంతరం రాత్రీ ఎనిమిది గంటలకు మరో నలుగురు మిత్రులను ఇంటికి పిలిచాడు. అనంతరం వారు దర్జాగా ఇంటికి చేరుకుని ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌తో పాటు,కొన్ని విలువైన వస్తువులను, మత్తులో ఉన్న తొంబై యెళ్ల క్రిషన్‌ను ఫ్రిజ్‌లో కుక్కి కిడ్నాప్ చేశారు. అయితే ఇదంతా చూసిన వాచ్‌మెన్ మాత్రం తాను పాత ఫ్రిజ్ తీసుకెళుతున్నారు అనుకున్నానని కాని మనిషిని మాత్రం గమనించలేదని చెప్పాడు.

మత్తులోనే భార్య...
మత్తమందుతో నిద్రలోకి జారుకున్న క్రిషన్ భార్య ఆదివారం ఉదయం మేలుకునే సరికి భర్తతో పాటు ఇంట్లో పని చేసే యువకుడు సైతం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దుండగులు కోస్లాను కిడ్నాప్ చేశారా ఇంకా ఏదైన చేశారా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications