మోదీకి గుడి, ప్రధాని కోసం వేలు నరికి కాళికాదేవికి నైవేధ్యం పెట్టిన వీరాభిమాని, ఏం చేశాడంటే !

ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ అయిన లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈసారి విజయం సాధించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి భారీగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. దేశంలో అధికార పగ్గాలు చేపట్టేందుకు ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పార్టీలు భారీ ఎత్తున పోటీపడుతున్నాయి.

ఈ పార్టీల కార్యకర్తలు, రాజకీయ నేతల అభిమానులు పగలు, రాత్రి, ఎండ, వాన అంటూ తేడా లేకుండా తమ తమ పార్టీల గెలుపు కోసం నిరంతరం ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అభిమానులు అయితే మోదీ మళ్లీ ప్రధాని కావాలని జోరుగా ప్రచారం చేస్తున్నారు. దేవుడికి ప్రార్థనలు, ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదానాలు కూడా చేస్తున్నారు. ఇటీవల కర్ణాటకలోని మలే మహదేశ్వర్ కొండపైకి వెళ్లిన 105 ఏళ్ల బామ్మ ప్రధాని మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే.

A fan of Modi who cut off his finger and offered it to God to become the Prime Minister for the third time

నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని, అందుకే తాను మలే మహదేశ్వర కొండకు పాదయాత్ర చేశానని ఆ బామ్మ మీడియాకు చెప్పారు. దేశంలో మోదీ మరోసారి అధికారంలోకి రావాలని కర్ణాటకలోని వందలాది మంది అభిమానులు మోదీకి కోసం దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక నరేంద్ర మోదీ వీరాభిమాని అతని వేలును కోసుకుని దేవుడికి నైవేధ్యంగా సమర్పించి మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని ప్రత్యేక పూజలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ఉత్తర కన్నడ జిల్లాలోని కారవారలోని సోనార్వాడకు చెందిన అరుణ్ వర్నేకర్ ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని. గత పదేళ్లలో ప్రధానిగా నరేంద్ర మోదీ చేసిన సేవలను మనస్ఫూర్తిగా మెచ్చుకున్న అరుణ్ వార్నేకర్ మళ్లీ మోదీనే ప్రధాని కావాలని ఆశపడుతున్నాడు. మోదీని మరోసారి ప్రధానిగా చూడాలనే తపనతో అరుణ్ వార్నేకర్ ఉన్నాడు. అరుణ్ వార్నేకర్ తన ఇంట్లో మోదీకి ప్రత్యేకంగా గుడి కట్టి రోజూ పూజలు చేస్తున్నాడు. ఈ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహం, మోదీతో పాటు భారతమాత విగ్రహం కూడా పెట్టాడు

ప్రతిరోజు మోదీని ఆరాధ్యిస్తున్న అరుణ్ వార్నేకర్ నిత్యం ఆయనకు పూజలు చేస్తున్నాడు, నేను మోదీ ఆరాధకుడనే అనే బోర్డు కూడా పెట్టాడు. అలాంటి వీరాభిమాని అయిన అరుణ్ వార్నేకర్ మళ్లీ ప్రధాని కావాలని అతని చేతి వేలు కోసుకుని మోదీ మరోసారి ప్రధాని కావాలని, ఎన్డీఏకి 378కి పైగా ఎంపీ సీట్లు రావాలని ఆ గుడిలో రాసి పెట్టాడు. ఇలా రాసిపెట్టి బోర్డుకు వెలు కత్తిరించి నైవేధ్యంగా పెట్టిన అరుణ్ వార్నేకర్ అతని స్వామి భక్తిని చాటుకున్నాడు.

A fan of Modi who cut off his finger and offered it to God to become the Prime Minister for the third time

గోడలు, పోస్టర్లపై అతని చెయ్యి కత్తిరించిన సమయంలో వచ్చిన రక్తం చల్లాడు. 2014లో నరేంద్ర మోదీ విజయం కోసం ఇదే అరుణ్ వార్నేకర్ అతని రక్తంతో ప్రజలకు బహిరంగ లేఖ రాశాడు. 2019లో కూడా మోదీ ప్రధాని కావాలని అతని కుడి చేతి వేలు కోసుకుని కాళీమాతకు నైవేద్యంగా పెట్టాడు. 2019లో మోదీ రెండో సారి ప్రధాని కావడంతో అది అతని విజయంగా బావించిన అరుణ్ వార్నేకర్ సంబరాలు చేసుకున్నారు.

ఇప్పుడు మోదీ మూడోసారి ప్రధాని కావాలని మరో వేలు కత్తిరించి కాళీమాతకు రక్తాభిషేకం చేశాడు. అరుణ్ వర్ణేకర్ తన వేలును కోసుకోగా తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ వేలిని తిరిగి అమర్చడం సాధ్యం కాదని వైద్యుడు చెప్పడంతో వేలు పూర్తిగా కత్తిరించి దానికి తొలగించారని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై అరుణ్ వార్నేకర్‌కు ఉన్న అభిమానాన్ని కొందరు మెచ్చుకుంటే, మరికొందరు దీనిని విపరీతమైన పిచ్చిగా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+