రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు: శరత్ కుమార్, దినకరన్ ఎఫెక్ట్ !
రాజకీయ కక్షతోనే తన ఇంటి మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీ వ్యవస్థాపకుడు, బహుబాష నటుడు శరత్ కుమార్ అన్నారు.
చెన్నై: రాజకీయ కక్షతోనే తన ఇంటి మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి పార్టీ వ్యవస్థాపకుడు, బహుబాష నటుడు శరత్ కుమార్ అన్నారు.

ఆర్ కే నగర్ లో టీటీవీ దినకరన్ కు మద్దతు ప్రకటించిన మరసటి రోజే శరత్ కుమార్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. శరత్ కుమార్ ఇంటిలో కొన్ని లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. శుక్రవారం వేకువ జామున 5.30 గంటల సమయంలో శరత్ కుమార్ ఇంటిలో సోదాలు మొదలు పెట్టారు.
ఎగ్మూర్ లోని ఓ హోటల్ లో ఆర్ కే నగర్ నియోజక వర్గంలోని ఓటర్లకు నగదు పంచిపెడుతున్నారని సమాచారం రావడంతో అక్కడ ఐటీ అధికారులు దాడులు చేశారు. చెన్నైలో 21 ప్రాంతాల్లో, పుదుకోటైలో 11 చోట్ల, తిరుచునాపల్లిలో రెండు చోట్ల, నమ్మక్కల్ లో ఒక చోట ఐటీ అధికారులు దాడులు చేశారు.












Click it and Unblock the Notifications