రిజర్వ్ బ్యాంక్ టవర్స్ లో అగ్ని ప్రమాదం

ముంబై: భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం గమనించిన అక్కడి సిబ్బంది రిజర్వ్ బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు.

పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. సంఘటనా స్థలంలో 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు.

A fire broke out in the Reserve Bank of India building in Mumbai

మంటలు వ్యాపించడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. ముంబైలోని బంద్రాలో కుర్లా కాంప్లెక్స్ నాలుగవ అంతస్తులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టవర్స్ ఉంది.

శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనంలో మంటలు వ్యాపించాయని ఫిర్యాదు చేశారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగింది అని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+