రైతంటే అంత చులకనా..! పలకరించడమే పాపమన్నట్టుగా..
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఆసరా లేకుండా అయిపోతుంది. ఏ ప్రభుత్వ పథకాలు అన్నదాతల ఆకలిని తీర్చలేకపోతున్నాయి. తీవ్ర కరువుతో దేశంలొని రైతులంతా అల్లాడుతున్న వేళ.. పరిస్థితికి అద్దం పడుతూ దేశ రాజధాని ఢిల్లీలో, ప్లకార్డు చేతబట్టిన ఓ రైతు తనకు సహాయం చేయాల్సిందిగా ఢిల్లీ రోడ్ల వెంబడి కనిపించిన ప్రతీ ఒక్కరిని వేడుకుంటున్నాడు.
చిత్రంగా చాలామంది ఆ రైతును చూసీ చూడనట్టుగా వెళ్లిపోయారు తప్పిస్తే.. సహాయం కాదు కదా, కనీసం పలకరించే ప్రయత్నం కూడా ఎవరు చేయకపోవడం నిజంగా చింతించాల్సిన విషయం. దాదాపుగా 5 గంటల పాటు ఆ రైతు ఢిల్లీ రోడ్ల వెంట తిరిగితే.. అందరూ మాకెందుకు అన్నట్టుగానే రైతును దాటేసుకుంటూ వెళ్లిపోయారు. ఇక ఇండియా గేట్ వద్దనైతే అక్కడున్న పోలీసు బలవంతంగా రైతును అక్కడినుంచి పంపించేసే ప్రయత్నం చేశాడు.

కాగా.. కష్టాల్లో ఉన్న రైతుల పట్ల దేశ ప్రజలు ఏ మేరకు స్పందిస్తారో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో, ప్రయోగాత్మకంగా ఈ ప్రయత్నం చేశారు. కానీ రైతుల పట్ల జనాలు ఎంత చిన్న చూపుతో వ్యవహరిస్తున్నారో ఈ ప్రయోగంతో తేలిపోయింది. కాలే కడుపులతో గ్రామాల నుంచి వలసబాట పడుతున్న రైతులు కొందరైతే.. ఏదో భరోసా రాకపోదా అని ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నవారు గ్రామాల్లో ఎంతోమంది. మరి ఇలాంటి రైతన్నలందరు సంతోషంగా ఉండే రోజు ఎప్పుడొస్తుందో..!












Click it and Unblock the Notifications