పీకలదాక తాగేసి ఆసుపత్రిలో మహిళకు డయాలసిస్ చేసిన ప్రభుత్వ ఉద్యోగి, వాడు చేసిన పనికి ?
బెంగళూరు/విజయపుర: కర్ణాటకలోని విజయపూర జిల్లా ఇండి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మద్యం సేవించి ఓ మహిళకు డయాలసిస్ చేసేందుకు ప్రయత్నించారు. ఇండి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మహిళ మృతి చెందింది. మద్యం తాగి ప్రభుత్వాసుపత్రికి వచ్చిన సిబ్బందితో తీవ్ర గందరగోళం నెలకొంది. మద్యం మత్తులో డయాలసిస్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగులు మహిళ ప్రాణం తీశారు.
ఈ ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఇండి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకోవడంతో స్థానిక ప్రజలు హడలిపోయారు. డయాలసిస్ చేస్తుండగా ఓ మహిళా రోగి ఆస్పత్రి బెడ్‌పైనే మృతి చెందింది. ఆస్పత్రి ఎదుట మహిళ మృతదేహం పెట్టిన ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఎదుట టైర్లకు నిప్పంటించి నిరసనలు చేశారు. బిస్మిల్లా సదాఫ్ అలియాస్ సధాఫ్ (35) అనే మహిళ మృతి చెందింది.

సధాఫ్ మావినహళ్లి గ్రామానికి చెందిన మహిళ. కిడ్నీ సమస్యల కారణంగా బిస్మిల్లా సధాఫ్ ను ఆమె తల్లిదండ్రులు డయాలసిస్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బసవరాజ్ హంజాగి అలియాస్ బసవరాజ్ పీకలదాక మద్యం తాగి ఆమత్తులో డయాలసిస్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. రోగి బిస్మిల్లా సధాఫ్ కు డయాలసిస్ సరిగా పాటించకపోవడం వల్లే ఆమె మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కుమార్తె సధాఫ్ ను కోల్పోయిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో కన్నీరుమున్నీరుగా విలపించారు. బిస్మిల్లా సధాఫ్ డయాలసిస్ కోసం తీసుకొచ్చారు. డయాలసిస్ చేయించుకోవాలని మీరు ఇక్కడే ఉంటే తాను కొంతసేటిలో వస్తానని చెప్పిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బసవరాజు ఆసుపత్రిలో నుంచి బయటకు వెళ్లిపోయాడు.
మధ్యాహ్నం 12 గంటలకు మద్యం తాగి ఆసుపత్రికి వచ్చాడు. ఆ తర్వాత తాగి వచ్చిన బసవరాజ్ సధాఫ్ కు డయాలసిస్ చేస్తుండగా తడబాటుపడ్డాడు. డయాలసిస్ చేయించుకుంటున్న బిస్మిల్లా సధాఫ్ అదే ఆసుపత్రిలోని మంచంపైనే మృతి చెందింది. ఇండి తాలూకా ఆసుపత్రి ఎదుట సధాఫ్ కుటుంబ సభ్యులు ఆందోళకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్తలానికి చేరుకుని సధాఫ్ కుటుంబ సభ్యులకు నచ్చచెప్పారు. సధాఫ్ చనిపోందని తెలుసుకున్న బసవరాజ్ ఆసుపత్రిలో నుంచి తప్పించుకుని పరారైనాడు.












Click it and Unblock the Notifications