‘నా చెల్లెలిపై అత్యాచారం చేశాడు’: రక్తంతో రాశాడు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో నీరజ్ కుమార్(26) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. అతడిని చంపిన వ్యక్తి మృతుడి రక్తంతో గోడ మీద 'ఇతను నా చెల్లిపై అత్యాచారం చేశాడు' అని రాసి వెళ్లాడు.
పోలీసుల కథనం ప్రకారం... ఈ ఘటన అక్కడి గ్రీన్ వ్యాలీ అపార్ట్‌మెంటులో చోటుచేసుకుంది. కుమార్ ఉత్తర ప్రదేశ్‌లోని మురాదాబాద్‌కు చెందినవాడు. ఉద్యోగం వెతుక్కోవడానికి ఉత్తరాఖండ్‌కి వచ్చాడు.
ఆదివారం అర్ధ రాత్రి 1:30గంటల ప్రాతంలో ఢిల్లీ నుంచి అతని తల్లిదండ్రులు వచ్చి తలుపు తట్టారు. అప్పుడు కుమార్ వచ్చి తలుపుతీశాడు. అనంతరం తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని నిద్ర పోయాడు. ఉదయం అతని కుటుంబ సభ్యులు ఎంత తలుపుతట్టినా తలుపుతీయలేదు.

కిటికీలోంచి గదిలోకి చూసేసరికి అతడు రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి ముఖంపై ఎవరో ప్రెషర్ కుక్కర్‌తో పలుమార్లు కొట్టి చంపారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!