Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భార్య, అత్తమామలను చంపేసి పాపతో పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఇంజనీర్, లవ్ స్టోరి క్లైమాక్స్ !

గుహవాటి/అప్సోం: కోవిడ్ లాక్‌డౌన్‌లో పుట్టిన ప్రేమకథ అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో విషాదకరంగా ముగిసింది. నజీబుర్ రెహమాన్ బోరా, సంఘమిత్ర ఘోష్ మధ్య వివాహం జరిగింది. ఆ ప్రేమ కథ ఎవ్వరూ ఊహించని విదంగా విషాదకరంగా ముగిసింది. నజీబుర్ రహమాన్ బోరా అతని భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులను హత్య చేసి తొమ్మిది నెలల పాపతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడని వెలుగు చూసింది.

పోలీసుల కథనం ప్రకారం, కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో జూన్ 2020లో మెకానికల్ ఇంజనీర్ అయిన నజీబుర్, సంఘమిత్ర ఫేస్‌బుక్‌లో స్నేహితులయ్యారు. నెలరోజుల్లోనే వీరి స్నేహం ప్రేమగా మారింది. అదే ఏడాది అక్టోబర్‌లో ఇద్దరూ కోల్‌కతాకు పారిపోయారు. అయితే సంఘమిత్ర తల్లిదండ్రులు ఆమెను గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆమెకు కోల్‌కతాలో నజీబుర్‌తో వివాహమైంది.

boy41
ఈ విషయం తెలుసుకున్న సంఘమిత్ర తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జును ఘోష్, సంజీవ్ ఘోష్ మరియు జును ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘమిత్ర మీద దొంగతనం ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘమిత్రను అరెస్టు చేసి నెల రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో గడిపారు. బెయిల్ పొందిన తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది.

జనవరి 2022లో సంఘమిత్ర ఆమె భర్త నజీబుర్ మళ్లీ పారిపోయారు. ఈసారి ఐదు నెలల పాటు చెన్నైలో నివసించారు. ఆ దంపతులు ఆగస్టులో గోలాఘాట్‌కు తిరిగి వచ్చేసరికి సంఘమిత్ర గర్భవతి. ఆమె నజీబుర్ ఇంట్లో నివసించడం ప్రారంభించింది. గత నవంబర్‌లో ఒక అందమైన బిడ్డకు సంఘమిత్ర జన్మనిచ్చింది. నాలుగు నెలల తర్వాత ఈ ఏడాది మార్చిలో సంఘమిత్ర తన మైనర్ కొడుకుతో కలిసి నజీబర్ ఇంటిని వదిలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది.

deadbody21

అంతేకాదు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని నజీబుర్ మీద ఆమె భార్య సంఘమిత్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసిన పోలీసులు నజీబ్‌ను అరెస్టు చేశారు. నెల రోజుల జైల్లో ఉన్న తర్వాత నజీబుర్ బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నజీబుర్ తన బిడ్డను కలవాలనుకున్నాడు. కానీ సంఘమిత్ర కుటుంబం నజిబుర్ కు ఆ అవకాశం ఇవ్వలేదని తెలిసింది.

వాస్తవాని సంఘమిత్ర మరియు అతని కుటుంబ సభ్యులు నజీబుర్‌పై దాడి చేశారని ఆరోపిస్తూ ఏప్రిల్ 29న నజీబుర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో నజీబుర్ అతని భార్య సంఘమిత్ర, ఆమె తల్లిదండ్రులను హత్య చేశాడు. అనంతరం తొమ్మిది నెలల పాపతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

policestation

పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించగా, సంఘమిత్ర మరియు ఆమె తల్లిదండ్రుల మృతదేహాలు ఘోష్ ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నాయి. నిందితులపై హత్యలు, ఇంటిలో చొరబాడ్డాడని కేసులు నమోదు చేసినట్లు అస్సాం పోలీస్ చీఫ్ జీపీ సింగ్ ట్వీట్ చేశారు. ఈ దారుణ హత్యలపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర సీఐడీ బృందాన్ని నియమించారు. ఫోరెన్సిక్ బృందాలు కూడా సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారని, తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బుధవారం గోలాఘాట్‌లోని సంఘమిత్ర నివాసం చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని సీఎం బాధితులకు హామీ ఇచ్చారు. బాధితురాలి సోదరి అంకితను కూడా నిందితులు కొట్టారని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ విలేకరులకు చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి అంకిత తనకు ఒక లేఖ రాసిందని. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సీఎం హిమంత బిస్వా శర్మ స్థానిక మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+