నాకు ఎవరితో అక్రమ సంబంధం లేదు, నేను నా ప్రియుడితో పారిపోలేదు, భర్తకు ఫోన్ చేసి?
పాట్నా/బీహార్: వివాహం చేసుకున్న దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త, పిల్లలతో జీవితాంతం సుఖంగా జీవించాలని మహిళ అనుకుంది. అయితే పరిస్థితులు తారుమారు అయ్యాయి. భర్తకు ఫోన్ చేసిన మహిళ తనకు ఎవరితోను అక్రమ సంబంధం లేదని, తాను ఎవరితోను పారిపోవడం లేదని, ఈ విషయం బంధువులకు చెప్పాలని చెప్పి ఫోన్ కట్ చేసింది.
బీహార్ లోని బేగుసరాయ్ సమీపంలోని మోహనపుర్ గ్రామంలో పూజా కుమారి అలియాస్ పూజా (32) అనే మహిళ నివాసం ఉంటున్నది. 11 ఏళ్ల క్రితం రవి అనే వ్యక్తితో పూజాకు వివాహం అయ్యింది. రవి, పూజా దంపతులకు తన్యా (10), ఆదిత్య (8), ఆయుష్ (6) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. రవి, పూజా ఫ్యామిలీలో పెద్దగా ఆర్థిక సమస్యలు కూడా లేవని తెలిసింది.

నాలుగు రోజుల క్రితం పూజా ఆమె భర్త రవికి ఫోన్ చేసింది. నువ్వు అనుకున్నట్లు తనకు ఎవరితోను అక్రమ సంబంధం లేదని, తాను ఎవరితో పారిపోవడం లేదని చెప్పి ఫోన్ కట్ చేసింది. హడలిపోయిన భర్త రవి పోలీసులకు, బంధువులకు సమాచారం ఇచ్చాడు. బంధువులు, పోలీసులు పూజా, ఆమె ముగ్గురు పిల్లల కోసం అప్పటి నుంచి వెతుకుతున్నారు.
భగవాన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బూర్హి గ్యాండన్ నది వంతెన మీద పూజా, ఆమె పిల్లల చెప్పులు, పూజా మొబైల్ ఫోన్, పూజా వేసుకున్న బంగారు గొలుసు ముక్కలు కనపడటంతో పోలీసులు, బంధువులు హడలిపోయారు, గజ ఈతగాళ్లు, స్థానికుల సహాయంతో నదిలో గాలించారు. సోమవారం నదిలో పూజాతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు శవమై కనిపించారు.
కుటుంబ సమస్యల కారణంగా పూజా ఆమె ముగ్గురు పిల్లలను నదిలో తోసి హత్య చేసి ఆత్మహత్య చేసుకుందని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి అనీల్ కుమార్ చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. మద్యంకు బానిస అయిన భర్త రవి అతని భార్య పూజాను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడని గ్రామస్తులు చెప్పారని పోలీసులు అన్నారు. పూజా భర్త రవిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి అనీల్ కుమార్ చెప్పారని స్థానిక మీడియా తెలిపింది.












Click it and Unblock the Notifications