అయోధ్యలో రాముడి ముందు ప్రముఖ హీరోలు, పవిత్రమైన రోజు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !

కాంతార సినిమా తర్వాత ఆ సినిమా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రపంచ స్థాయి స్టార్ అయిపోయాడు. రిషబ్ శెట్టి తదుపరి సినిమా కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. కాంతారను మంచిపోయే అద్బుతమైన సినిమాను మళ్లీ తెరపైకి తీసుకురావడానికి రిషబ్ శెట్టి సిద్ధం అయ్యాడు. కాంతార పార్ట్ 2 సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. స్యాండిల్ వుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో రిషబ్ శెట్టికి మంచి మార్కెట్ కూడా వచ్చేసింది.

ఇదిలా ఉంటే స్యాండిల్ వుడ్ హీరో, మాజీ ప్రధాని మనుమడు, మాజీ సీఎం కుమారుడు నిఖిల్ కుమారస్వామి, రిషబ్ శెట్టి కలిసి తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటో తీసుకుంది బెంగళూరులో కాదు. రిషబ్ శెట్టి, నిఖిల్ కుమారస్వామిల ఫోటోను స్వయంగా రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటో విషయం ఆసక్తిగా మారింది. రిషబ్ శెట్టి తను ఏది చేసినా ప్రత్యేకతతో చేస్తాడు అని స్యాండిల్ వుడ్ కు చెందిన సినీ ప్రముఖులు అంటున్నారు. ఇదే రిషబ్ శెట్టి సక్సెస్ రేటు ఎక్కువ కావడానికి కారణం అయ్యింది.

A photo of Kantara movie hero Rishabh Shetty and Nikhil Kumaraswamy has gone viral on social media

హీరో, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి ఇప్పుడు మాజీ సీఎం కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామితో కలిసి సినిమా చేస్తారా? అని స్యాండిల్ వుడ్ లో చర్చ మొదలైయ్యింది. నిఖిల్ కుమారస్వామి, రిషబ్ శెట్టి కాంబినేషన్ విషయంలో ఇప్పుడు అందరిలో ఆసక్తి ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా నటుడు నిఖిల్ కుమారస్వామితో రిషబ్ శెట్టి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో, స్యాండిల్ వుడ్ ప్రముఖుల వాట్సాప్ గ్రూప్స్ లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ ఫోటో వెనుక అసలు కథ ఏంటి? అని అందరూ ఆరా తీశారు.

రిషబ్ శెట్టితో నిఖిల్!
దేశం మొత్తం ఎక్కడ విన్నా అయోధ్య శ్రీరాముడి పేరు వినిపిస్తోంది. ఈ సమయంలో రామ నామంతో దేశమంతా మార్మోగిపోతా ఉంది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్బంగా సోమవారం మరోసారి దేశంలో దీపాలు వెలిగించి దీపావళి పండుగ జరుకున్నారు. అయోధ్యలోనే కాదు, యావత్ దేశంలోని ప్రజలు రామమందిర ప్రారంభోత్సవం కోసం ఎదురు చూశారు. అయెధ్య రామ మందిరం ప్రారంభం కావడంతో దేశం మొత్తం హిందువులు పండుగ చేసుకున్నారు.

అదే అయోధ్యలో కాంతార సినిమా హీరో, ఆ సినిమా దర్శకుడు రిషబ్ శెట్టి, మరో హీరో నిఖిల్ కుమారస్వామి కలుసుకున్నారు. అయోధ్యలోని శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బాలీవుడ్ తో పాటు భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు అయోధ్యకు వెళ్లారు. రిషబ్ శెట్టి కూడా అయోధ్యకు వెళ్లి శ్రీరాముని దర్శనం చేసుకున్నారు. ఇదే సమయంలో నిఖిల్ కుమారస్వామి కూడా ఆయన తాత, మాజీ ప్రధాని హెచ్ డీదేవెగౌడ, తండ్రి కుమారస్వామితో కలిసి శ్రీరాముని దర్శనం కోసం అయోధ్యకు వెళ్లారు.

A photo of Kantara movie hero Rishabh Shetty and Nikhil Kumaraswamy has gone viral on social media
రామ జన్మస్థలం రిషబ్ శెట్టి, నిఖిల్ కుమారస్వామి కలిశారు. ఇలా కలిసిన ఇద్దరు వ్యక్తులు ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఇప్పుడు రిషబ్ శెట్టి, నిఖిల్ కుమారస్వామి ఫోటో వైరల్ అవుతోంది. అలాగే ఈ ఫోటోపై జోరుగా చర్చ సాగుతోంది, ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తారా? అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. కాంతార తరువాత రిషబ్ శెట్టి తదుపరి సినిమా మీద అందరికి అంచనాలు పెరిగిపోయాయి

2022లో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా రిషబ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ప్రస్తుతం రిషబ్ కాంతార ఎ లెజెండ్ సినిమాతో నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు రిషబ్ శెట్టి, నిఖిల్ కుమారస్వామి కలయిక కూడా క్యూరియాసిటీని రేకెత్తించింది.

వీటన్నింటితో సంబంధం లేకుండా ఇద్దరు కన్నడ నటీనటులు కలుసుకోవడం ఆసక్తిని రేకెత్తించింది. సినిమాల్లో బిజీగా ఉన్న వీరిద్దరూ వరుస సినిమాలను తెరపైకి తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక కాంతార 2 సినిమా రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అలాగే, నిఖిల్ కూడా 2024లో పలు ప్రాజెక్ట్‌లతో వెండి తెరమీద పందడి చెయ్యడానికి సిద్దం అవుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+