relative: వీడు బంధువు కాదు, రాబంధువు, నాలుగేళ్ల అమ్మాయిని ?, రాత్రి చూస్తే షాక్ !
చెన్నై: కామంతో రగిలిపోతున్న కామాంధులకు అక్కాచెల్లి, అమ్మా, భార్య అని తేడా లేకుండా పోయింది. అన్యంపుణ్యం తెలియని పసిపిల్లల మీద అత్యాచారం చేసి వారి కామం తీర్చుకుంటున్నారు. బంధువుల కుమార్తెను ఇంటికి పిలుచుకుని వెళ్లి లైంగిక వేధిపులకు గురి చెయ్యడంతో ఆమె స్పృహ తప్పిపడిపోయంది. బాలికను సమీపంలోని నిర్జన ప్రదేశంలో పడేసిన కామాంధుడు చేతులు దులుపుకోవలాని ప్రయత్నించాడు.
చెన్నైలోని పల్వరం సమీపంలోని నాగల్కేణి బుద్ధి నగర్ ప్రాంతంలో ఉత్తర భారతదేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన 20కి పైగా కుటుంబాలు అక్కడే నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ సందర్భంలో, ఒక కుటుంబానికి చెందిన భార్యాభర్తలు భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. దంపతులు వారి 4 ఏళ్ల కుమార్తెను బంధువుల ఇంటి వద్ద వదిలి వెలుతున్నారు. భార్యాభర్తలిద్దరూ సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చిన తరువాత పాపను ఇంటికి పిలుచుకుని వెలుతున్నారు.

బంధువు ఇంటి దగ్గర ఉన్న నాలుగేళ్ల అమ్మాయి కనిపించలేదు. దీంతో షాక్‌కు గురైన వారు పరిసరాల్లో వెతికారు. అప్పుడు ఇంటి సమీపంలోని నిర్జనప్రదేశంలో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు షాక్ తిన్నారు. వెంటనే వారు బాలికను రక్షించి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఆరా తీయగా వారి బంధువు జాన్ మొయిద్దీన్(28) అనే కామాంధుడు నాలుగేళ్ల బాలికను తన ఇంటికి తీసుకెళ్లి రోజంతా లైంగికంగా వేధించాడని తేలింది.
ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు శంకర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు సమాచరం ఇవ్వడంతో పోలీసులు జాన్ మొయిద్దీన్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు నిందితుడు మెయిద్దీన్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. తాంబరం మహిళా పోలీసులు కామాంధుడిని విచారిస్తున్నారు. నాలుగు సంవత్సరాల అమ్మాయి మీద బంధువే లైంగిక వేధింపులకు పాల్పడటం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది.












Click it and Unblock the Notifications