నన్ను సుఖపెట్టు, నువ్వు సుఖపడు, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్, స్టాఫ్ నర్సుతో !
బెంగళూరు/కోప్పళ: ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న వైద్యుడు అక్కడి నర్సుల మీద కన్ను వేశాడు. ఓ సాఫ్ట్ నర్స్ మీద కన్ను వేసి ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. ప్రశ్నించడానికి వెళ్లిన నర్సు భర్త మీద డాక్టర్ రగిలిపోయాడు. తనను చంపడానికి నర్సు భర్త వచ్చాడని కేసు పెట్టిన డాక్టర్ ఆమె భర్తను జైలుకు పంపించాడు. ఇప్పుడు స్టాఫ్ నర్సు రంగంలోకి దిగింది.
కర్ణాటకలోని కోప్పళ తాలూకాలోని హిరేసిందోగి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రమేష్ మూలిమణి అలియాస్ రమేష్ మీద స్టాప్ నర్సు తనను డాక్టర్ శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని అలవండి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. తనకు శారీరకంగా సహకరించాలని, తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని తనను శారీరకంగా, మానసికంగా డాక్టర్ రమేష్ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ స్టాఫ్ నర్సు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డాక్టర్ మీద ఫిర్యాదు చేసింది.

నర్సు భర్త వెళ్లి డాక్టర్ రమేష్ ను నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తుడైన డాక్టర్ రమేష్ ఆ నర్సును మరింతగా వేధించడంతోపాటు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తానని, భార్యాభర్తలను విడదీస్తానని నర్సును బెదిరించాడు. అంతటితో ఆగని వైద్యుడు రమేష్ వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఉద్యోగం చెయ్యడానికి ఆసుపత్రికి వెలుతున్న నర్సును ఆ డాక్టర్ టార్చర్ పెట్టాడు.
పలుకుబడి ఉపయోగించిన డాక్టర్ రమేష్ నర్సు సక్రమంగా ఉద్యోగానికి రావడంతో లేదని ఆమెకు గత రెండు నెలలుగా జీతం రాకుండా చేశాడు. దీంతో తన భార్యకు జీతం ఎందుకురాలేదని అడిగేందుకు నర్సు భర్త డాక్టర్ రమేష్ దగ్గరకు వెళ్లాడు. ఆ సందర్బంలో తన మీద దాడి చేసి తనను చంపడానికి నర్సు భర్త ప్రయత్నించాడని అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేసి అతన్ని జైలుకు పంపించాడు. డాక్టర్ రమేష్ వేధింపులతో విసిగిపోయిన ఆ సాఫ్ట్ నర్సు అలవండి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీని ప్రకారం పోలీసులు డాక్టర్ రమేష్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications