పహల్గామ్ రక్తపు తడి ఆరకముందే- కాశ్మీర్‌లో పేట్రేగిన ఉగ్రవాదులు
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో చోటు చేసుకున్న ఉగ్రదాడి ఘటనను ఇంకా విస్మరించకముందే మరో ఘాతుకం సంభవించింది. పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు అక్కడి సామాజిక ఉద్యమకారులు, కార్యకర్తలపై తుపాకీ ఎక్కుపెట్టారు.
తాజాగా ఓ సామాజిక ఉద్యమ కార్యకర్తపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. రక్తస్రావం కావడం వల్ల కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడా సామాజిక ఉద్యమ కార్యకర్త.

అర్ధరాత్రి దాటిన తరువాత కుప్వారా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన పేరు- గులాం రసూల్ మాగ్రే. జిల్లాలోని కండీఖాస్‌లో నివాసం ఉంటోన్నారు. ఉగ్రవాదం వల్ల సంభవించే పరిణామాలపై తరచూ ప్రజలకు అవగాహన, చైతన్యం కలిగించే కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. చదువు గొప్పదనాన్ని వివరిస్తూ స్థానిక పాఠశాలల్లో శిబిరాలను ఏర్పాటు చేస్తుంటారు.
పహల్గామ్ నరమేధంపైనా క్షేత్రస్థాయిలో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోన్నారు గులాం రసూల్. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వకూడదంటూ ప్రచారం చేస్తోన్నారు. వారికి సంబంధించిన ఎలాంటి ఆచూకీని అయినా పోలీసులకు అందజేయాలంటూ ప్రజల్లో విజ్ఞప్తి చేస్తోన్నారు.
ఇప్పుడు తాజాగా గులాం రసూల్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కండీఖాస్‌లో ఇంట్లో నిద్రిస్తోన్న సమయంలో బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాటం చేస్తోన్నారాయన.
ఈ ఘటన తరువాత భద్రత బలగాలు అప్రమత్తం అయ్యాయి. కుప్వారా జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సమీప అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం ఈ జిల్లాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ సైతం నిర్వహించాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications