Union Budget 2025: నిర్మల బడ్జెట్ టీమ్- ఏరి కోరి ఎంపిక..!!
Union Budget 2025-26: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల వేళ రాష్ట్రపతి ముర్ము ప్రారంభోపన్యాసం చేసారు. ప్రధాని బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు. రేపు పార్లమెంట్ లో ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ రూపకల్పన కోసం నిర్మల తన టీంను ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు. సుదీర్ఘ కసరత్తు తరువాత దేశ బడ్జెట్ రూపకల్పనకు తుది రూపు ఇవ్వనున్నారు. ఈ టీంలో ఉన్నదెవరు.. వారి పాత్ర ఏంటి.
తుది కసరత్తు
బడ్జెట్ ప్రవేశ పెట్టేది ఆర్దిక మంత్రి. నిర్మలా వైపు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. కానీ, దేశ ఆర్దిక పరిస్థితులు.. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్ రూప కల్పన చేసేది మాత్రం ఆర్దిక శాఖ అధికారులు.. నిపుణులు. నిర్మలా సీతారామన్ టీం లీడర్ గా వీరిని నడిపిస్తారు. భారత ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు 6.4 శాతంగా నమోదైంది. ఇది నాలుగేళ్ల కనిష్ఠ స్థాయి. ఇటీవల ఒకానొక దశలో డాలరుతో రూపాయి మారకం విలువ రూ.86.7కు పతనమైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నిర్మలా సీతారామన్ టీమ్ కేంద్ర బడ్జెట్‌ను తయారు చేసింది.

నిర్మలా బడ్జెట్ టీంలో
ఆర్థిక వృద్ధిరేటును పెంచేలా బడ్జెట్ రూపకల్పన పైన సుదీర్ఘ కసరత్తు జరిగింది. దేశ స్థూల దేశీయ ఉత్పత్తి(జీడీపీ)లో ద్రవ్యలోటు విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక, బడ్జెట్ టీంలో కీలక పాత్ర పోషించింది ఆరుగురు ముఖ్య అధికారులు వారిలో కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తుహిన్ కాంతపాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేఠ్, వ్యయ విభాగం కార్యదర్శి మనోజ్ గోవిల్, పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఏఎం) కార్యదర్శి అరుణిశ్ చావ్లా, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం.నాగరాజు, ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ ఉన్నారు.
సీనియర్ల సారధ్యంలో
తుహిన్ కాంత పాండే 1987 బ్యాచ్ ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, రెవెన్యూశాఖ కార్యదర్శి. ఈయన ఆర్థిక శాఖలో చాలా సీనియర్. ఈయన పరిధిలో కీలకమైన ఆరు విభాగాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా నుంచి ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను తుహిన్ పర్యవేక్షించారు. మరో ముఖ్య అధికారి అజయ్ సేఠ్. ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా ఉన్నారు. ఈయన 2021 నుంచి కేంద్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నారు. యావత్ బడ్జెట్ తయారీ ప్రక్రియను ఈయన విభాగమే పర్యవేక్షిస్తుంది. మరో ముఖ్య అధికారి మధ్య ప్రదేశ్ కు చెందిన 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మనోజ్ గోవిల్. కేంద్ర వ్యయ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కీలక భూమిక
అరుణిశ్ చావ్లా ప్రస్తుతం ప్రజా ఆస్తుల నిర్వహణా విభాగాధికారి. బీహార్ కు చెందిన ఆయన డీపీఈ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. అరుణిశ్ చావ్లా సారథ్యంలోనే ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. ఇక ఆర్దిక సేవల విభాగ కార్యదర్శి నాగరాజు. త్రిపురకు చెందిన నాగరాజు
బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచే ప్రతిపాదనల పైన పని చేస్తున్నారు. మరో అధికారి అనంత నాగేశ్వరన్. ప్రస్తుతం భారత ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ సలహాదారుగా పని చేస్తున్నారు. ఆర్దిక సర్వే నివేదిక సిద్దం చేసింది నాగేశ్వరన్ సారధ్యంలోనే. 2022 నుంచి ఆర్దిక సలహాదారుగా కొనసాగుతున్నారు. ఇక, ప్రస్తుత బడ్జెట్ రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.












Click it and Unblock the Notifications