తండ్రి ఇతర వంశస్థులను పెళ్లి చేసుకుంటే... కొడుకుకు శిక్ష, గిరిజనుల్లో వింత అచారం

భారత దేశం ఓవైపు పాశ్చాత్య పోకడలలకు వెళుతుంటే..మరోవైపు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా కులాలు, మతాల పట్టింపులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వివాహాల విషయంలో గిరిజన సంప్రదాయాలు కట్టుబాట్లు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తండ్రి ఇతర కులానికి చెందిన వ్యక్తిన పెళ్లి చేసుకున్నాడని కొడుకుకు శిక్ష విధించారు. తన భార్య చనిపోతే జరిమాన చెల్లించేవరకు దహన సంస్కరాలు జరగకుండా రెండు రోజులు అపారు. దీంతో శవం కళ్లిపోయో దశకు చేరుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయిన కుల పెద్దలు వినకుండా జరిమాన తర్వాత చెల్లిస్తానని చెప్పడంతో అంత్యక్రియలు సుఖాంతం అయ్యాయి.

జరిమాన చెల్లించనందుకు అంతిమ సంస్కరాలు అడ్డుకున్న గ్రామస్థులు,

జరిమాన చెల్లించనందుకు అంతిమ సంస్కరాలు అడ్డుకున్న గ్రామస్థులు,

ఒడిశాలోని మయూరుబంజ్ జిల్లాలోని కులియాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కుచేయ్ జిల్లాలో అమానుషం జరిగింది. కులం కట్టుబాట్లు పాటించలేదని ఓ గిరిజన మహిళ శవానికి అంత్యక్రియలు నిర్వహాణను అడ్డుకున్నారు. కుచెయ్ గ్రామంలోని కాంద్ర సోరెన్ అనే కార్మికుడి భార్య అనారోగ్యంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్దమయియన కాంద్రకు కులం కట్టుబాట్లు ఎదురయ్యాయి. ఆయన చెల్లించాల్సిన 12000 వేల రుపాయాల జరిమానను చల్లించకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించకుండా రెండు రోజుల పాటు అపారు.

గిరిజన తెగల్లో ఇంకా కొనసాగుతున్న వింత సాంప్రదాయాలు

గిరిజన తెగల్లో ఇంకా కొనసాగుతున్న వింత సాంప్రదాయాలు

ఇరవై సంవత్సరాల క్రితం కాండ్ర తండ్రి సునారం సోరెన్ ఇతర వంశానికి చెందిన మహిళను వివాహం చేసుకోవడంతో అయనకు 12000 రుపాయల జరిమానానను విధించారు. అయితే ఈ జరిమాన ఎక్కువగా లైవ్‌స్టాక్ రూపంలో చేల్లించాల్సి ఉంటుంది. మరోవైపు కాండ్ర కుటుంభం రోజువారి కూలిపనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో జరిమానాను చెల్లించలేకపోయింది. అర్ధిక ఇబ్బందుల నేపథ్యంలోనే తనకున్న పశువులను సైతం ఇటివలే అమ్మివేశారు. ఇక వారి వద్ద ఎలాంటీ పశువులు లేవు. దీనికి తోడు కాండ్ర భార్య చనిపోవడంతో గిరిజనులకు అవకాశం చిక్కింది. దీంతో జరిమాన చెల్లించేవరకు తన భార్య అంతిమ సంస్కరాలు నిర్వహించవద్దని అడ్డుకున్నారు.

పోలీసులు జోక్యం చేసుకున్న లేని ఫలితం

పోలీసులు జోక్యం చేసుకున్న లేని ఫలితం

దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని దహన సంస్కరాలు విషయంలో జోక్యం చేసుకున్నారు. అయితే కులం కట్టుబాట్లు కావడంతో పోలీసులు కూడ ఏం చేయాలేకపోయారు. దీంతో చెల్లించాల్సిన జరిమానాను కొద్ది రోజుల అనంతరం చెల్లిస్తాననడంతో కథ సుఖాంతమైంది. కాగా కొన్ని యుగాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని ఎవరు కాదనలేరని అందుకే కాండ్ర అత్తమామ కూడ ఎలాంటీ సహాయం చేయలేకపోయారని గ్రామస్థులు తెలిపారు. కాగా ఒడిషాలోని గిరిజనులు, గిరిజేనతరులను పెళ్లిళ్లు చేసుకుంటే ఇలాంటీ కట్టుబాట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ఒడిశా మంత్రికి తప్పని జరిమాన

ఒడిశా మంత్రికి తప్పని జరిమాన

ఇక జరిమానాల వేటు రాష్ట్ర రెవెన్యూ మంత్రికి కూడ తప్పలేదు. ఒడిశా రెవెన్యు మంత్రిగా సుదాం మరాండి కూతురు బ్రహ్మణ కులానికి చెందిన యువకుడిని వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంభాన్ని సంతాలుల గిరిజన తెగ నుండి బహిష్కరించారు. కాగా ఈ పెళ్లికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు ఒడిశా మాజీ గవర్నర్ సైతం హజరయ్యారు. కాగా ఆయన పదవి కాలం అయి పోయిన తర్వాత కులం విధించిన జరిమానాను చెల్లించిన పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలోనే జరిమానాలు చెల్లించడంలో మంత్రి అయినా సాధరణ పౌరుడైన ఒక్కటేనని స్థానిక గిరిజన తెగనాయకులు చెప్పడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+