Viral Video: ట్రైన్ వెళ్లిపోతుందిలే అని ముందుకొచ్చాడు.. కానీ మరో ట్రాక్ లో రైలు.. వీడియో వైరల్..
భారత్ లో చాలా చోట్ల రైల్వే గేట్ల వద్ద వంతెనలు లేవు. దీంతో రైలు వచ్చినప్పుడు వాహనదారులు గంటల కొద్ది వేచి ఉండాల్సి వస్తోంది. అయితే రైల్వే గేట్ల వద్ద చాలా మంది అత్యుత్సహం చూపి ప్రమాదంలో పడుతున్నారు. ఒక్కొసారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఓ రైల్వే గేటు వద్ద జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరో ట్రాక్ లో
ఈ వీడియోలో రైల్వే గేటు వద్ద గేటు పడినా కొంత మంది ముందుకెళ్లారు. ఓ ట్రాక్ పై ట్రైన్ వెళ్తుంది. దీంతో వాహనదారులు ట్రాక్ దగ్గరకు వెళ్లారు. అప్పుడే మరో ట్రాక్ పై మరో రైలు వస్తుంది. ఇది గమనించిన వారు వెనక్కు వెళ్లారు. అయితే ఓ వాహనదారుడు వెనక్కు వెళ్లే ప్రయత్నం చేశాడు. బైక్ ను వెనక్కు మలుపు తిప్పాలని చూశాడు.

కింద పడిన బైక్..
కానీ కంగారులో బైక్ కింద పడిపోయింది. అయినప్పటికీ అతను అతను ద్విచక్రవాహనాన్ని లాగా ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యపడలేదు. దీంతో చివరికి వాహనాన్ని వదిలి పక్కకు జరిగారు. దీంతో ట్రైన్ బైక్ ఢీ కొట్టి వెళ్లిపోయింది. అక్కడున్న వారు సురక్షితంగా బయటపడినా వాహనం మాత్రం పూర్తిగా ధ్వంసం అయింది.
97 వేలకు పైగా వ్యూస్
ఈ దృశ్యాలు అక్కడే లైల్వే శాఖ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియోను డా. అజయిత ట్విట్టర్ పోస్ట్ చేశారు. ఆయన వీడియోతో పాటు మీరు మీ బండిని తర్వాతి స్టేషన్లో తీసుకొవచ్చని రాసుకొచ్చారు.ఈ వీడియో 7 గంటల క్రితం పోస్ట్ చేయగా 97 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 6,772 లైక్స్ వచ్చాయి. 1035 మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications