బంగారం దిగుమతి ట్యాక్స్ భారీగా పెంపు- బాంబు పేల్చిన కేంద్రం: నేటి నుంచే అమలు
బంగారం కొనుద్దు.. కొనొద్దు అంటూ చెబుతూ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాంబు పేల్చారు. పసిడిపై దిగుమతి సుంకాలను అమాంతం పెంచేశారు. వెండి, ప్లాటినమ్, ఇతర విలువైన లోహాలు కూడా దీని పరిధిలోకి చేర్చారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన ట్యాక్స్ నేటి నుంచే అమలులోకి వచ్చింది కూడా. దీని దెబ్బకు బంగారం, వెండి రేట్లు ఆకాశానికి ఎగబాకడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ కస్టమ్స్ సుంకం రేట్లను సవరించడం వల్ల వాటి దిగుమతులు మరింత ఖరీదవుతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ లో బంగారం, వెండి, ప్లాటినం మాత్రమే కాదు. ఆభరణాల విడిభాగాలు, పారిశ్రామిక దిగుమతులకు సైతం ఈ అధిక సుంకం వర్తిస్తుంది.
బంగారం, వెండి దిగుమతులపై ప్రభుత్వం 10 శాతం బేసిక్ కస్టమ్స్ ట్యాక్స్ పడింది. దీనికి అదనంగా మరో అయిదు సెస్ కూడా. ఈ అయిదు శాతం సెస్ మొత్తాన్ని వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి మళ్లిస్తారు. దీంతో బంగారం, వెండి, ఇతర విలువైన లోహాల దిగుమతి పన్ను ఎకాఎకిన 6 నుంచి 15 శాతానికి పెరిగింది. విదేశీ కొనుగోళ్లను తగ్గించి, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం.

ఈ క్రమంలో 2018, 2021 నాటి కస్టమ్స్ నోటిఫికేషన్లను సవరించింది కేంద్రం. నిర్దుష్ట కోటా కింద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి బంగారం దిగుమతులపై గత రాయితీ డ్యూటీని ప్రభుత్వం తొలగించింది. ఆభరణాల ఫైండింగ్స్ అంటే.. హుక్స్, క్లాస్ప్‌ల వంటి విడిభాగాలపైనా డ్యూటీ రేట్లను సవరించారు. బంగారం, వెండి ఫైండింగ్స్‌పై అయిదు శాతం, ప్లాటినం ఫైండింగ్స్‌పై 5.4 శాతం కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుంది.
విలువైన లోహాలను రీసైక్లింగ్ చేయడానికి ఉద్దేశించిన స్పెంట్ కేటలిస్ట్‌లు లేదా బూడిద దిగుమతులపై రాయితీ డ్యూటీ కూడా రద్దయింది. నిర్దేశిత నిబంధనలకు లోబడి, ఇటువంటి దిగుమతులకు 4.35 శాతం రాయితీ కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ బంగారం దిగుమతులు 24 శాతం పెరిగాయి. 71.98 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. 2024-25లో ఈ సంఖ్య 58 బిలియన్ డాలర్లే. 2023-24లో కూడా ఈ స్థాయిలో లేదు. అప్పుట్లో 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2022-23లో చాలా పరిమితంగా అంటే 35 బిలియన్ డాలర్ల మేర బంగారం దిగుతమతులు నమోదయ్యాయి దేశంలో.
పరిమాణంపరంగా చూస్తే వీటిలో తగ్గుదల కనిపించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 4.76 శాతం తగ్గి 721.03 టన్నులకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 757.09 టన్నులుగా నమోదైంది. బంగారం 10 గ్రాముల ధర లక్షన్నకు చేరడం దీనికి ప్రధాన కారణం.












Click it and Unblock the Notifications