"పెద్ద షాక్ రాబోతోంది.. సిద్ధంగా ఉండండి"

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల్ని వణికిస్తున్నాయి. ముడి చమురు, గ్యాస్, విద్యుత్ సంక్షోభంతో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసింది. ప్రపంచదేశాలతోపాటు భారత్ కు కీలకమైన సముద్ర రవాణా మార్గం ఇదే. భారత్ చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో 60 నుంచి 65 శాతం వరకు చమురు హార్మూజ్ జలసంధి ద్వారానే మనకు చేరుతుంది. భారత్ తో పాటు సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఖతార్ ఇలా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నౌకలన్నీ ఈ జలసంధి గుండానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ మార్గం మూసివేయడంతో ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి.

భారత్ లోనూ చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఇదే విషయంపై ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విదేశీ మారక ద్రవ్యం నిల్వలను కాపాడుకోవడానికి ఇంధనాన్ని ఆదా చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని సూచించారు. సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయొద్దని తెలిపారు. ఏడాదిపాటు విదేశీ ప్రయాణాలు మానుకోవాలన్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలతో దేశ ప్రజలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.

అయితే తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల పెరుగుదలపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా త్వరలోనే భారత్ లో చమురు ధరల సెగ తగులుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు పెద్ద షాక్ రాబోతుంది అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన చమురు ధరల ప్రభావం భారత్ లో ఇంకా ప్రభావం కనిపించలేదని ఆ ప్రభావం త్వరలోనే భారీగా ఉండబోతుందని ఆయన పేర్కొన్నారు. కష్టకాలం రాకముందే మనం మానసికంగా సిద్ధంగా ఉండాలని అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పలు సూచనలు చేశారు. ఉదయ్ కోటక్ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

UdayKotak Warns of Major Shock Amid West Asia Tensions A Major Shock is Coming Be Prepared Kotak

ఇక అంతర్జాతీయ ముడి చమురు ధర బ్యారెల్ కు 120 డాలర్లు చేరుకున్నప్పటికీ గత 18 నెలలుగా భారత్ లో రిటైల్ ఇంధన ధరలను పెద్దగా మార్చలేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఇదివరకే పేర్కొన్నారు. ప్రజలపై భారం పడకుండా చమురు మార్కెటింగ్ సంస్థలు రోజుకు దాదాపు రూ. 1000 కోట్ల వరకు నష్టాలు భరిస్తున్నాయని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+