ఆ అపరిచితుడి వ‌ల్ల రెండేళ్లు న‌ర‌కం అనుభ‌వించా..ఏడ్చిన రోజులూ ఉన్నాయి: ఎట్టకేలకు అనుపమ ఓపెన్

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, లవ్ ఎఫైర్స్, డేటింగ్, సీక్రెట్ మ్యారేజ్ లు కామన్ అయిపోయాయి. వీటి గురించి రోజూ సెలబ్రిటీలు ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉంటారు. తమ లైఫ్ లో ఇలాంటివి దాటుకునే వచ్చామని చాలామంది సినీతారలు బహిరంగంగానే అనేకసార్లు వెల్లడించారు. ఇక సెలబ్రిటీల లైఫ్ లో లవ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు ఇలా అన్నీ క్షణాల్లో జరిగిపోతుంటాయి. చాలామంది సెలబ్రిటీ జంటలు ఈ లిస్టులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన పాస్ట్ లైఫ్, చేదు అనుభవాలను పంచుకున్నారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. ముఖ్యంగా యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ తో ఆమె కుర్రకారు మదిలో సుస్థిర స్థానం సంపాదించారు. ప్రేమమ్, అఆ, శతమానంభవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురూ ప్రేమ కోసమే లాంటి సినిమాలతో యువత, ఫ్యామిలీస్ కు దగ్గరయ్యారు. ఆ తర్వాత రాక్షసుడు,కిస్కింధపురి లాంటి థ్రిల్లర్ సినిమాలతోనూ హిట్ కొట్టారు. కార్తికేయ 2, టిల్లూ స్క్వేర్ సినిమాలతో అలరించారు. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.

anupama finally opens I went through hell on set because of that stranger there were days I cried

అయితే తాజాగా అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తన మాజీ ప్రియుడిపై సంచ‌న‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అత‌డి వ‌ల్ల గ‌త రెండేళ్లుగా న‌ర‌కం అనుభ‌వించాన‌ని ఓపెన్ అయ్యారు. అత‌డిని పెళ్లి చేసుకుంటే ఈ పాటికి విడాకుల‌తో త‌మ బంధం ముగిసిపోయుండేద‌ని కుండ బద్దలు కొట్టారు. అనుప‌మ చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్‌ గా మారాయి. అతనిది విక్రమ్ సినిమాలోని అపరిచితుడి మనస్తత్వం అని పేర్కొన్నారు.

ఓ రోజు రెమో మాదిరి ప్రేమను కురిపిస్తాడని.. మరో రోజు మానసికంగా, శారీరకంగా హింసిస్తాడు. వెంటనే సారీ చెప్తాడు. ఇంకెప్పుడు ఇలా చేయనని కన్నీళ్లు పెట్టుకుంటూ లెక్కలేనన్ని ప్రామిస్ లు చేస్తాడు అని వాపోయారు. తనతో సినిమాలు మాన్పించి తనను అతడి ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించాడని.. మానసిక ఒత్తిడికి తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయా.. మందులు వాడాను.. ఒక్కసోరి సెట్స్ లో తీవ్ర ఆందోళన చెంది కారావాన్ లోకి వెళ్లి ఏడ్చిన సందర్భాలూ ఉన్నాయి.. అని అనుపమ పరమేశ్వరన్ ఎమోషనల్ అయ్యారు.

అయితే కోలీవుడ్ యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ తో ఇటీవల మనస్పర్థల కారణంగా బ్రేకప్ అయిన తర్వాత అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ కామెంట్స్ చేయడం సంచలనంగా మారాయి. కానీ ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అతడి పేరును చెప్పడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు కోలీవుడ్ తో పాటు పలు ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+