వాయుగుండం ఎఫెక్ట్: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు- తాజా హెచ్చరిక..!!

విపత్తుల నిర్వహణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ ఈరోజు సాయంత్రం లోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో వానలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు సక్రమంగా కురవడం లేదు. ఇక అల్పపీడనం, వాయుగుండం వంటివి బంగాళాఖాతంలో ఏర్పడినప్పుడే వాటి ప్రభావంతో మోస్తరు వానలు పడుతున్నాయి. ఈ సమయంలోనే విపత్తుల నిర్వహణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోందని.. దీని ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పింది. దీనితో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. కొన్ని జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీచే సూచన ఉంది.

 విశాఖ నుంచి తిరుపతికి కొత్తగా మరో రైలు - రూట్, టైమింగ్స్..!!
విశాఖ నుంచి తిరుపతికి కొత్తగా మరో రైలు - రూట్, టైమింగ్స్..!!
apsdma-latest-alerts-over-rain-in-many-areas-of-the-state-for-next-two-days-here-the-report

వాతావరణం పై తాజా అలర్ట్స్

రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వివరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల నుంచి 33 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24డిగ్రీల నుంచి 26 డిగ్రీల వరకు నమోదవుతాయని చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణ వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘాలతో కూడి ఉంటుంది. ఉక్కపోత ఉంటుందని చెప్పింది. కొన్నిచోట్ల వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాలలో భారీ వానలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+