బంగారం ధరల్లో అంచనాలు తలకిందులు
దేశీయ మార్కెట్‌లో పసిడి ప్రియులకు ఊరట లభించట్లేదు. బంగారం ధరలు నేడు కూడా పెరిగాయి. బుధవారం నాటితో పోల్చుకుంటే స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. రానున్న పండుగలు, వివాహాల సీజన్ తరుణంలో ఈ ధరల పెరుగుదల కొనుగోలుదారులకు మరింత భారంగా మారినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక పరిణామాలు, డాలర్ ఇండెక్స్ ఒడిదొడుకులు పసిడి ధరలపై నేరుగా ప్రభావం చూపాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిస్థితులు, దేశీయంగా పెరుగుతున్న స్పాట్ డిమాండ్ కారణంగా వరుసగా నాలుగు రోజులుగా బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బుధవారం నాటి క్లోజింగ్ సెషన్స్ తో పోల్చి చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల నమోదైంది. 270 రూపాయల మేర పెరిగింది. 22 క్యారెట్లల్లో రూ. 250, 18 క్యారెట్లల్లో 210 రూపాయల మేర పెరుగుదల చోటు చేసుకుంది.

ఇది స్వల్పమే అయినప్పటికీ.. కిందటి వారం నుంచి స్థిరంగా పెరుగుతూ వస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మున్ముందు వీటి ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే సంకేతాలను ఇచ్చినట్టయింది. ఇప్పటికే ఎంసీఎక్స్ అక్టోబర్ ఫ్యూచర్ గోల్డ్ కాంట్రాక్టులు 1,58,000 రూపాయల మార్క్ ను దాటవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి అనుగుణంగా నేడు కూడా ధరలు పెరగడం చర్చనీయాంశమౌతోంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్లు బంగారం ధర 10 గ్రాములకు రూ.1,55,530, 22 క్యారెట్లు రూ.1,42,200 వద్ద నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,55,130, 22 క్యారెట్లు రూ.1,42,200 వద్ద స్థిరపడింది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,130 కాగా 22 క్యారెట్లు రూ.1,42,220 వద్ద నమోదైంది. చెన్నైలో ఇవే రేట్లు రూ.1,55,630, 22 క్యారెట్లు రూ.1,44,210 వద్ద కొనసాగుతోంది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,513, 22 క్యారెట్లు - రూ. 14,220, 18 క్యారెట్లు - రూ. 12,000
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,513, 22 క్యారెట్లు- రూ. 14,220, 18 క్యారెట్లు - రూ. 11,635
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,513, 22 క్యారెట్లు- రూ. 14,220, 18 క్యారెట్లు - రూ. 11,635
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,513, 22 క్యారెట్లు- రూ. 14,220, 18 క్యారెట్లు - రూ. 11,635
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,513, 22 క్యారెట్లు- రూ. 14,220, 18 క్యారెట్లు - రూ. 11,635
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,513, 22 క్యారెట్లు- రూ. 14,220, 18 క్యారెట్లు - రూ. 11,635













Click it and Unblock the Notifications