ఏపీలో కొత్త ఆరు పైలట్ ట్రైనింగ్ సెంటర్స్.. ఏవియేషన్ పై చంద్రబాబుసర్కార్ ఫుల్ ఫోకస్!

ఏపీలో కేంద్ర పౌర విమాన యాన శాఖామంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టటం ఏపీకి వరంగా మారింది. మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీలో ఏవియేషన్ అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు సర్కార్ కూడా ఏపీలో విమానయాన రంగ అభివృద్ధికి ఫుల్ గా దృష్టి సారించింది.

రాష్ట్రంలో ఆరు కొత్త పైలట్ శిక్షణా కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణా రాష్ట్రంలో ఆరు కొత్త పైలట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ కొత్త పైలెట్ శిక్షణా కేంద్రాలు కర్నూలు, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల్లో ఏర్పాటు కానున్నాయి.

Six new pilot training centres to be set up at Kurnool Rajahmundry and Kadapa airports good news for Andhra Pradesh

ఈ విమానాశ్రయాలలోనే పైలెట్ శిక్షణా కేంద్రాల ఏర్పాటు

రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ నిర్వహణలో కర్నూలు విమానాశ్రయం ఉంది. రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాలు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నాయి.
ఇవి మాత్రమేకాక తిరుపతి విమానాశ్రయంలో కూడా ఎఫ్‌టీవోలు ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతి పొందిన ప్రైవేటు సంస్థలు ఈ కేంద్రాలను నిర్వహించనున్నాయి.

వివిధ దశల్లో పైలెట్ శిక్షణా కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ

కర్నూలులో రెండు ఎఫ్‌టీవోలకు రాష్ట్రంలోని కూటమి సర్కార్ అనుమతి ఇచ్చింది. వాటిలో ఒకటి ఈ నెల 22న ప్రారంభం కానుంది. రెండోది డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుంది. రాజమహేంద్రవరంలో రెండు పైలెట్ శిక్షణా కేంద్రాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఆరు నెలల్లోగా అవి ప్రారంభం కావచ్చు. కడపలోనూ రెండు ఎఫ్‌టీవోలకు టెండర్లు ప్రారంభించారు.
ఒక్కో కేంద్రం ద్వారా 30 నుంచి 40 మందికి పైలట్ శిక్షణ అందించే అవకాశం ఉంటుంది.

తెలంగాణాకు 11.56లక్షల ఇళ్ళు కేటాయించాలని కేంద్రానికి మంత్రి పొంగులేటి విజ్ఞప్తి.. కేంద్రమంత్రి రెస్పాన్స్ ఇదే!
తెలంగాణాకు 11.56లక్షల ఇళ్ళు కేటాయించాలని కేంద్రానికి మంత్రి పొంగులేటి విజ్ఞప్తి.. కేంద్రమంత్రి రెస్పాన్స్ ఇదే!

ఏపీలో పైలెట్ ట్రైనింగ్ ఔత్సాహికులకు పండుగే

ఇప్పటివరకు రాష్ట్రంలో పైలెట్ శిక్షణ అందుబాటులో లేదు. కాబట్టి ఈ శిక్షణా కేంద్రాల ద్వారా రాష్ట్రంలో ఏవియేషన్ పైన, పైలెట్ ట్రైనింగ్ పైన ఆసక్తి ఉన్న యువత ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. శిక్షణ సంస్థలు విమానాశ్రయంలోనే రన్‌వేకు అనుసంధానంగా హ్యాంగర్ ఏర్పాటు చేసి, చిన్న విమానాల ద్వారా శిక్షణ ఇస్తాయి. వాణిజ్య విమానాలు నడపాలంటే కనీసం 180 గంటల ఫ్లైట్ ట్రైనింగ్ అవసరం. ఇకపై ఆ శిక్షణ రాష్ట్రంలోనే అందుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+