విశాఖ నుంచి తిరుపతికి కొత్తగా మరో రైలు - రూట్, టైమింగ్స్..!!
తిరుపతికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ కీలక అప్డేట్. విశాఖ నుంచి తిరుపతికి మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖ నుంచి ఇప్పటికే తిరుపతికి వెళ్తున్న రెగ్యులర్ రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. దీంతో.. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు కొత్తగా మరో రైలును ప్రవేశ పెట్టారు. కాగా.. విశాఖ నుంచి త్వరలోనే బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందు కు కసరత్తు జరుగుతోంది. ఈ రైలును సైతం తిరుపతి మీదుగా రాకపోక లు కొనసాగించాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
విశాఖ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణీకుల కోసం రైల్వే కీలక ప్రకటన చేసింది. విశాఖ నుంచి తిరుపతికి ప్రస్తుతం వీక్లీ ఎక్స్ ప్రెస్ గా ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. రద్దీ.. ఆదరణ పరిశీలన చేసిన తరువాత రెగ్యులర్ సర్వీసు గా మార్చే అంశం పరిశీలించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. కాగా.. ఈ రైలు నెంబర్ 08509 తిరుపతి- విశాఖ వీక్లీ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 10వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రతీ ఆదివారం, గురువారం తిరుపతిలో ఉదయం 9.50 గంటలకు బయల్దేరి.. తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఇక ఇదే రైలు విశాఖపట్నం-తిరుపతి(08510) ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 11 వరకు సర్వీసులు అందించనుంది. ప్రతీ సోమ, శుక్రవారాల్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు సాయంత్రం 6.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

రైలు రూట్ - షెడ్యూల్
కాగా, ఈ రైలులో 22 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు మరియు రేణిగుంట రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు నిలుపుదల (హాల్ట్) సౌకర్యం కల్పించారు. దీనివల్ల ఉత్తరాంధ్ర మరియు కోస్తాంధ్ర ప్రాంత ప్రయాణికులకు తిరుపతి ప్రయాణం మరింత సులభతరం కానుంది. వీకెండ్‌లో సాధారణ రైళ్లలో కన్ఫర్మ్ టికెట్లు దొరకక ఇబ్బంది పడే ప్రయాణికులకు మరియు భక్తులకు ఈ స్పెషల్ రైలు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ప్రత్యేక రైలు సర్వీసుల టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ఐఆర్‌సిటీసీ వెబ్‌సైట్, ఐఆర్‌సిటీసీ యాప్‌తో పాటు అన్ని రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో అందుబాటులోకి వచ్చాయి. కాగా.. విశాఖ నుంచి త్వరలో బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పూర్తి అధ్యయనం.. రైలు షెడ్యూల్ ఫిక్స్ చేసారు. కాగా.. తిరుపతి మీదుగా ఈ రైలు నడపాలనే డిమాండ పైన తుది నిర్ణయం తరువాత అధికారికంగా వందేభారత్ స్లీపర్ ప్రారంభ ముహూర్తాన్ని వెల్లడించనున్నారు.












Click it and Unblock the Notifications