ChatGPTతో పరీక్షలో దొరికిన విద్యార్థి.. ఐఐటీ బొంబాయిలో స్టూడెంట్ బలవన్మరణం!

ఐఐటీ బొంబాయి క్యాంపస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పరీక్షలో మొబైల్ ఫోన్ ఉపయోగించి ఛాట్‌జీపీటీ ద్వారా సమాధానాలు వెతుకుతూ దొరికిపోయిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థి సాహిల్ వాకోడే శుక్రవారం సాయంత్రం తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో క్యాంపస్‌లో భారీ ఎత్తున నిరసనలు మిన్నంటాయి. గడిచిన ఆరు నెలల కాలంలో ఐఐటీ బొంబాయిలో చోటుచేసుకున్న మూడో ఆత్మహత్య ఇది కావడం గమనార్హం.

భారత్ పై చర్యలకు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. ఆ సంతకంతో తలకిందులు
భారత్ పై చర్యలకు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. ఆ సంతకంతో తలకిందులు

ఈ ఘటనపై ఐఐటీ యాజమాన్యం స్పందిస్తూ.. పరీక్షా సమయంలో ప్రశ్నాపత్రాన్ని ఛాట్‌జీపీటీకి అప్‌లోడ్ చేస్తుండగా.. సదరు విద్యార్థి దొరికిపోయాడని తెలిపింది. అయితే అతడిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ప్రారంభించలేదని సంస్థ పేర్కొంది. హెచ్‌వోడీ, కోర్స్ ఇన్‌స్ట్రక్టర్ విద్యార్థితో మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చారని, ఈ సంఘటన అతడి విద్యా భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపదని హామీ ఇచ్చారని వెల్లడించింది. ఆ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత హాస్టల్ గదికి వెళ్లిన సాహిల్ వాకోడే.. సాయంత్రానికి శవమై కనిపించాడు. ఈ విషాదకర ఘటనపై సంస్థ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ విచారణకు సహకరిస్తున్నట్లు ప్రకటించింది.

IIT Bombay Student Kills Self After Being Caught Using ChatGPT in Exam Campus protests erupt over allegations

అయితే ఐఐటీ యాజమాన్యం చెబుతున్న మాటలలో నిజం లేదని విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. కాపీ కొడుతూ దొరికిపోయిన సాహిల్ వాకోడేను ఏడాది పాటు సస్పెండ్ చేస్తామని, హాస్టల్ ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు బెదిరించారని నిరసకారులు ఆరోపించారు. అలా సస్పెండ్ అయితే ఇంజినీరింగ్ పూర్తికావడానికి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందనే భయంతో, తీవ్ర మానసిక ఒత్తిడికి గురై సాహిల్ వాకోడే ఈ నిర్ణయం తీసుకున్నాడని విద్యార్థులు వాపోతున్నారు. యాజమాన్యం పూర్తి వివరాలను బయటపెట్టాలని, విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేశారు.

ట్రంప్ వార్నింగ్.. అస్సలు తగ్గేదే లేదన్న భారత్!
ట్రంప్ వార్నింగ్.. అస్సలు తగ్గేదే లేదన్న భారత్!

విద్యార్థుల నిరసనలతో ఐఐటీ పోవై క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సీనియర్ పోలీస్ అధికారి దత్తాత్రేయ నలావడే మాట్లాడుతూ.. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, నిరసన తెలుపుతున్న విద్యార్థులతో యాజమాన్యం చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి, జులై నెలల్లో కూడా ఇద్దరు విద్యార్ులు ఇలాగే ఆత్మహత్యకు పాల్పడటంతో ఐఐటీ క్యాంపస్‌లలో విద్యార్థుల మానసిక ఒత్తిడిపై మళ్లీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+