Crime News: ఇన్‍స్టా రీల్స్ మోజులో పడిన మహిళ.. చివరికి భర్త ఏం చేశాడంటే..!
ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెడ్ నడుస్తోంది. దాదాపు అందరికీ ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్, యూట్యూబ్ అకౌంట్లు ఉన్నాయి. దీంతో పాలు తాగే పిల్లాడి నుంచి కాటికి కాలు చాపిన వృద్ధుడి వరకు సెల్ ఫోనే లోకంగా మారింది. ముఖ్యంగా
ఇన్ స్టా రీల్స్ చూస్తూ, చేస్తూ ఫోన్లకే అతుక్కుపోతున్నారు. చిన్నా పెద్ద తేడా లేకు రీల్స్, షాట్స్ చేస్తున్నారు. కొందరు ఫాలోవర్స్ పెంచుకోవాలని రకరకాలుగా రీల్స్ చేస్తున్నారు. ఇలా రీల్స్ మోజులో పడిన ఓ మహిళ చివరికి ప్రాణాలు కోల్పోయింది.

హత్య
తన ఇన్ స్టా రీల్స్ పిచ్చితో భర్తకు కోపం తెపించింది. చివరకు ఆ భర్త చేతిలోనే హత్యకు గురయింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తిరుపూర్ జిల్లాలోని దిండుగల్‌కు చెందిన అమృతలింగం అనే వ్యక్తి కూరగాయల మార్కెట్‌లో కూలీగా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య చిత్ర, పిల్లలు ఉన్నారు. చిత్ర స్థానికంగా ఉన్న బట్టల పరిశ్రమలో పని చేస్తుంది.

చెన్నై
చిత్ర రెండు సంవత్సరాల క్రితం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసింది.ఆమె ఇన్ స్టాగ్రామ్ లో వచ్చే రీల్స్ చూస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమె రీల్స్ చేయడం కూడా ప్రారంభించింది. దీంతో ఆమె సమయం అంతా వాటి కోసమే కేటాయించింది. ఫాలోవర్స్ పెంచుకోవాలని రకరకాల రీల్స్ చేస్తూ ఉండేది. దీంతో భర్త అమృతలింగం చిత్రతో గొడవలు అయ్యాయి. అయితే ఆమెకు ఇన్ స్టాలో ఫాలోవర్స్ పెరగడంతో సినిమాలో నిటించాలని భర్త, పిల్లలను విడిచిపెట్టి చెన్నైకు వెళ్లింది.

గొంతు నులిమి
ఈ మధ్య ఓ వివాహా కార్యక్రమానికి చిత్రి ఇంటికి వచ్చింది. పెళ్లి తర్వాత ఆమె చెన్నైకి వెళ్లాలని ప్రయత్నించింది. భర్త అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాదులాట జరిగింది. గోపంతో ఊగిపోయిన అమృతలింగం చిత్ర గొంతు నులిమి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమృతలింగాన్ని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications