చెన్నై వరదలు: తల్లి శవం పక్కన 20 గంటలు

చెన్నై: చెన్నై నగర ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చివరికి అంత్యక్రియలు చెయ్యడానికి అవకాశం లేకపోవడంతో సహాయం చెయ్యాలని విలపిస్తున్నారు. చెన్నై నగరంలోని అశోక్ నగర ప్రాంతంలో దాదాపు 20 గంటల పాటు ఓ మహిళ ఆమె తల్లి శవం పక్కనే జాగరణ చేశారు.

అశోక్ నగర ప్రాంతంలో డయాలసిస్ చేయించుకుంటున్న 58 సంవత్సరాల మహిళ బుధవారం ఇంటిలోనే మరణించారు. ఆమెకు ఓ కుమార్తె ఉంది. రాత్రి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆమె తల్లి శవం పక్కనే జాగరణ చేశారు.

A Woman Sits With Mother's Body For Over 20 Hours in Chennai

గురువారం ఉదయం తన స్నేహితులతో ఆమె మొరపెట్టుకున్నారు. తమ అమ్మ నిన్ననే చనిపోయిందని, అంత్యక్రియలు చెయ్యడానికి సహాయం చెయ్యాలని, ఓ వాహనం ఏర్పాటు చేయాలని విలపించింది. ఇప్పటికే దుర్వాసన వస్తున్నదని ఆమె ఆవేదన చెందింది.

ఆమె స్నేహితులు మీడియాకు సమాచారం ఇచ్చారు. మీడియా వలన ఈ విషయం వెలుగు చూసింది. మహిళ అంత్యక్రియలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు చోట్ల వైద్యం అందకపోవడంతో రోగులు నానా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+