relative: బంధువు మీద పగతో ఎంతపని చేశాడంటే ?, ఏకంగా 20 కార్లు, సీసీటీవీల్లో ?
న్యూఢిల్లీ: వ్యక్తిగత కక్షతో ఓ వ్యక్తి కారుకు నిప్పుపెట్టాడు. ఆ కారు మంటలు ఇతర వాహనాలకు వ్యాపించిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. మల్టీ లెవల్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసిన కారుకు నిప్పంటించడంతో చుట్టుపక్కల ఉన్న 20కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. తెల్లవారుజామున ఢిల్లీలోని శుభాష్ నగర్‌లోని మల్టీ లెవల్ పార్కింగ్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బంధువుతో కక్ష పెంచుకున్న 23 ఏళ్ల యష్ అరోరా అనే యువకుడు కార్లకు నిప్పు పెట్టాడని పోలీసులు అన్నారు.
ఈ పార్కింగ్ భవనానికి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ గడువు ముగిసిందని అధికారులు అంటున్నారు. ఎంసీడీ పార్కింగ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెల్లవారుజామున 4.30 గంటలకు పోలీసులకు కాల్ వచ్చింది. దీంతో 7 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అగ్నిప్రమాదం జరిగిందని తెలియగానే వాహనాలు అక్కడ పార్క్ చేసిన వాహన యజమానులు అక్కడికి చేరుకుని వారి వాహనాలను కాపాడే ప్రయత్నం చేశారు.

అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసే సమయానికి 20 కార్లు దగ్ధమయ్యాయి. పార్కింగ్ భవనంలోని 3వ బేస్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ కొన్ని వాహనాల బూడిద అయ్యాయి. వ్యక్తిగత కక్షతో నిప్పంటించిన యష్ అరోరా అనే యువకుడి మీద పలు సెక్షల కింద కేసులు నమోదు చేశామని డీసీపీ అక్షత్ కౌశల్ తెలిపారు. ఈ దారుణ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో కూడా రికార్డయింది. వీడియోలో నిందితుడు యష్ అరోరా తెల్లటి రంగు హోండా సిఆర్‌విలో పార్కింగ్ వద్దకు వచ్చాడు. అక్కడే పార్క్ చేసిన కారు టైర్లకు నిప్పంటించి వెంటే అదే కారులో కారులో తిరిగి వెళ్లిపోయాడు.
ఢిల్లీలోని సుభాష్ నగర్‌లో నివాసముంటున్న యష్ అరోరా కోసం గాలించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా చేశానని యష్ అరోరా చెప్పాడని పోలీసులు అన్నారు. ఇషాన్, నిందితుడు యష్ అరోరా బంధువులు. ఇషాన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇషాన్ కారుకు నిప్పంటించడంతో ఇంత జరిగిందని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications