మైనర్ అమ్మాయి కోసం ఆరాటం, పిలుకుని వెళ్లి ఏం చేశాడంటే ?. క్లైమాక్స్ లో గొంతుకు కోసుకుని !
రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక మృతదేహం కర్ణాటకలో లభ్యం అయ్యింది. కర్ణాటకలోని కోలారు జిల్లా మలూరు తాలూకా దొమ్మలూరు గ్రామంలో నివాసం ఉండే 15 ఏళ్ల నందిత అనే బాలిక హత్యకు గురైయ్యిందని పోలీసులు అన్నారు. బెంగళూరు రూరల్ జిల్లా అనుగొండనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నందిత అనే బాలిక మృతదేహం లభ్యమైంది.
పిచ్చి ప్రేమికుడి ఆగడాలకు మైనర్ అమ్మాయి బలైపోయిందని పోలీసులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులోని కోలార్ జిల్లా బరగూరు గ్రామానికి చెందిన 23 ఏళ్ల నితిన్ అనే యువకుడు 15 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నాడని తెలిసింది. ఇదే విషయంలో బాలిక నితిన్ ను మందలించిందని తెలిసింది. అయితే నితిన్ మాత్రం నిత్యం ఆమె వెంటపడి తనను ప్రేమించాలని తెలిసింది.

ప్రతిరోజు మైనర్ అమ్మాయి వెంట తిరుగుతున్న నితిన్ తనను ప్రేమించాలని, తననే పెళ్లి చేసుకోవాలని ఆమెను టార్చర్ పెట్టాడని సమాచారం. నువ్వు కచ్చితంగా నన్నే ప్రేమించాలని ఆమెను నితిన్ అడిగాడని, ఆ అమ్మాయి వెంటపడి ఆమెను వేధించాడని తెలిసింది. 15 రోజుల క్రితం కూడా నితిన్ బాలికను వేధించాడని స్థానికులు అంటున్నారు. అయితే గత రెండు రోజుల క్రితం బాలిక అదృశ్యమైనట్లు తెలుస్తోంది.
బాలిక కనపడకుండా పోయిన రెండు రోజుల తర్వాత అదే బాలిక బెంగళూరు గ్రామీణ జిల్లాలో శవమై కనిపించడం కలకలం రేపింది. నితిన్ అనే యువకుడు బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసి మృతదేహాన్ని నిర్జనప్రదేశంలో పారేశాడని ఆరోపణలు వచ్చాయి. బాలికను కత్తితో హత్య చేశారని పోలీసులు అంటున్నారు. బాలికను హత్య చేసిన తరువాత నిందితుడు నితిన్ కూడా కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గాయపడిన నిందితుడు నితిన్ కోలారులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బెంగళూరు గ్రామీణ జిల్లాలోని అనుగొండనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసి ఆసుపత్రిలో ఉన్న నితిన్ ను కోలుకున్న తరువాత అతన్ని విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు.












Click it and Unblock the Notifications