ప్రియురాలు దూరం అయ్యిందని రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య, నిశ్చితార్థం!

బెంగళూరు: ప్రేమించిన యువతి దూరం అయ్యిందని జీవితంపై విరక్తి చెందిన యువకుడు వేగంగా వెలుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని బయ్యప్పనహళ్ళి రైల్వేస్టేషన్ పరిధిలో జరిగిందని పోలీసులు తెలిపారు.

బయ్యప్పనహళ్లిలోని కార్మల్ రాయ్ ప్రాంతంలో శివమూర్తి (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వర్తురూకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. శివమూర్తి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని, అతనికి ఇచ్చి వివాహం చెయ్యడానికి వారు నిరాకరించారని సమాచారం.

A youth commit suicide after love failure in Bengaluru

ఇటీవల యువతికి వేరు యువకుడికితో నిశ్చితార్థం చేశారు. విషయం తెలుసుకున్న శివమూర్తి జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి 11. 30 గంటల సమయంలో శివమూర్తి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తరువాత కార్మల్ రాయ్ ప్రాంతంలో వేగంగా వెలుతున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

సోమవారం ఉదయం విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శివమూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యువతి కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగా శివమార్తి ఆత్మహత్య చేసుకున్నాడని అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివమూర్తి డెత్ నోట్ రాసిపెట్టాడని, దానిని స్వాధీనం చేసుకుని కేసు విచారణ చేస్తున్నామని బయ్యప్పనహళ్ళి పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+